‘గేమ్ ఛేంజర్’ తర్వాత రామ్ చరణ్ ‘ఉప్పెన’ ఫేమ్ బుచ్చి బాబు సాన దర్శకత్వంలో ‘ఆర్‌సీ16’ (వర్కింగ్ టైటిల్) అనే చిత్రం చేస్తోన్న విషయం తెలిసిందే. చరణ్ సరసన బాలీవుడ్ భామ జాన్వీకపూర్ హీరోయిన్‌గా నటిస్తోంది. కిలారు వెంకట సతీశ్ నిర్మించనున్న ఈ సినిమాను సుకుమార్ రైటింగ్స్-మైత్రీ మూవీ మేకర్స్ సంయుక్తంగా తెరకెక్కిస్తున్నాయి. ‘ఆర్‌సీ 16’కి ఆస్కార్ అవార్డ్ విన్నర్ ఏఆర్ రెహమాన్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, మ్యూజిక్ అందిస్తున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతుండగా.. త్వరలోనే ఈ మూవీ సెట్స్ పైకి వెళ్లనుంది. ఈ నేపథ్యంలో ఈ చిత్రం నుంచి ఓ ఇంట్రెస్టింగ్ అప్‌డేట్ వచ్చింది. కోలీవుడ్ స్టార్ హీరో చియాన్ విక్రమ్ హీరోగా ఇటీవలే వచ్చిన ‘తంగలాన్’ సినిమాకు పనిచేసిన కాస్ట్యూమ్ డిజైనర్ ఏగన్ ఏకాంబరం ఆర్‌సీ 16 కోసం జాయిన్ అయ్యాడు. ఈ మేరకు తాజాగా చిత్ర దర్శకుడు బుచ్చి బాబు సాన టీమ్ లోకి స్వాగతించారు. ఈ సందర్భంగా ఏగన్ ఏకాంబరం సోషల్ మీడియా వేదికగా తన ఆనందాన్ని పంచుకున్నారు.
ఎక్స్ వేదికగా ఏకాంబరం ఇలా తెలిపారు.. “నేను టాలీవుడ్‌లో మొదటిసారి పని చేస్తున్నాను, ఈ క్షణం కోసం చాలా కాలంగా ఎదురుచూస్తున్నాను, ప్రస్తుతం ఇది జరుగుతోంది. ఇంత మంచి అవకాశం ఇచ్చిన దర్శకుడు బుచ్చిబాబు సనకు నా కృతజ్ఞతలు. మిస్టర్ రామ్ చరణ్ సర్‌తో కలిసి పనిచేయడానికి చాలా ఉత్సాహంగా ఉన్నాను. తమిళం నుండి తెలుగు పరిశ్రమకు ఈ కొత్త జర్నల్‌లో, తెలుగులో కొత్త విషయాలను అన్వేషించడానికి మరియు వారి సంప్రదాయాల గురించి మరింత తెలుసుకోవడానికి ఇది గొప్ప అవకాశంగా భావిస్తున్నాను. రామన్ గారూ మీకు స్పెషల్ థ్యాంక్స్” అని పేర్కొన్నారు.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























