జీబ్రా నుండి క్యారెక్టర్ రివీలింగ్ మోషన్ పోస్టర్ రిలీజ్

Zebra Character Revealing Motion-Poster Unveiled From Satya Dev's Movie

టాలీవుడ్ ట్యాలెంటెడ్ హీరో సత్య దేవ్, కన్నడ స్టార్ డాలీ ధనంజయ కాంబోలో తెరకెక్కుతోన్న మోస్ట్ ఎవైటెడ్ మల్టీ-స్టారర్ ‘జీబ్రా’. లక్ ఫేవర్స్ ది బ్రేవ్ అనే ట్యాగ్‌లైన్ తో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి ఈశ్వర్ కార్తీక్ దర్శకత్వం వహిస్తున్నాడు. సత్యరాజ్, ప్రియా భవానీ శంకర్, జెన్నిఫర్ పిసినాటో, సత్య అక్కల, సునీల్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఈ నేపథ్యంలో తాజాగా ఈ చిత్రం నుంచి మేకర్స్ ఓ పోస్టర్ రిలీజ్ చేశారు. హీరో సత్యదేవ్ ఫస్ట్ లుక్ సహా ఇందులోని ప్రధాన పాత్రలను పరిచయం చేస్తూ మైండ్ బ్లోయింగ్ క్యారెక్టర్ రివీలింగ్ మోషన్-పోస్టర్ రిలీజ్ చేశారు. అలాగే మూవీ రిలీజ్ డేట్ ని కూడా అనౌన్స్ చేశారు. ఇక ఈ మోషన్ పోస్టర్ సత్యరాజ్, సత్య అక్కల, జెన్నిఫర్ పిసినాటో, సునీల్, ప్రియా భవానీ శంకర్, డాలీ ధనంజయ, సత్య దేవ్‌లని పరిచయం చేసింది.

ప్రతి పాత్రను ఇంటెన్స్ ఎక్స్ ప్రెషన్ తో ప్రజెంట్ చేశారు. కాగా ఈ మోషన్ పోస్టర్ సినిమాపై చాలా క్యురియాసిటీని పెంచింది. ఇక చివరి ఫ్రేమ్‌లలో మొత్తం నటీనటులు కనిపిస్తున్నారు. మోషన్ పోస్టర్‌లో కాయిన్ తిప్పడం, కరెన్సీ నోట్లు, ఫ్లైఓవర్ బ్రిడ్జిపై నుండి కారు దూకడం వంటి ఎక్సయిటింగ్ డైనమిక్ ఎలిమెంట్స్ క్రియేటివ్ గా ప్రజెంట్ చేశారు. రవి బస్రూర్ అందించిన ఇంటెన్స్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ థ్రిల్ ని మరింత పెంచింది.

కాగా ఈ మైండ్ బ్లోయింగ్ మోషన్ పోస్టర్ ద్వారా జీబ్రా దీపావళి కానుకగా అక్టోబర్ 31న అన్ని దక్షిణ భారత భాషల్లో మరియు హిందీలో థియేటర్లలోకి రానుందని అనౌన్స్ చేశారు. ఇక ఈ సినిమాను పద్మజ ఫిలింస్ ప్రైవేట్ లిమిటెడ్, ఓల్డ్ టౌన్ పిక్చర్స్ బ్యానర్లపై SN రెడ్డి, S పద్మజ, బాల సుందరం, దినేష్ సుందరం నిర్మిస్తుండగా.. ఎస్ శ్రీలక్ష్మి రెడ్డి సహ నిర్మాతగా ఉన్నారు. అలాగే సత్య పొన్మార్ సినిమాటోగ్రఫీ, అనిల్ క్రిష్ ఎడిటింగ్, మీరాఖ్ డైలాగ్స్ అందిస్తున్నారు.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు :

తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.