సీఎం రేవంత్ రెడ్డికి వరద విరాళాన్ని అందజేసిన సాయి దుర్గతేజ్

Sai Durgha Tej Handover Rs.10 Lakhs To CM Revanth Reddy For Flood Relief Efforts

తెలంగాణలో భారీ వర్షాలు, వరదలతో ఎంతోమంది ప్రజలు ఇబ్బందులు పడ్డారు. వరదల వల్ల భారీ ఆస్తి, ప్రాణనష్టం సంభవించింది. ఈ నేపథ్యంలో సుప్రీమ్ హీరో సాయి దుర్గతేజ్ వరద బాధిత ప్రజలను ఆదుకునేందుకు ప్రభుత్వం చేస్తున్న కృషికి అండగా నిలబడ్డారు. దీనిలో భాగంగా తన వంతు సహాయంగా 10 లక్షల రూపాయలు తెలంగాణ సీఎం రిలీఫ్ ఫండ్ కోసం ప్రకటించారు. ఈ క్రమంలో తాజాగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలుసుకున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఈ మేరకు హైదరాబాద్ జుబ్లీహిల్స్ లోని సీఎం నివాసానికి వెళ్లిన హీరో సాయి దుర్గతేజ్, సీఎం రేవంత్ రెడ్డికి 10 లక్షల రూపాయల డొనేషన్ చెక్ అందించారు. ఈ సందర్భంగా వరద సహాయ చర్యలపై ముఖ్యమంత్రిని అడిగి తెలుసుకున్నారు సాయి దుర్గతేజ్. రేవంత్ రెడ్డి గారిని కలిసి మాట్లాడటం పట్ల తన సంతృప్తిని, సంతోషాన్ని వ్యక్తం చేశారు సాయి దుర్గతేజ్.

కాగా తెలంగాణతో పాటు ఏపీలోనూ వరద బాధితుల సహాయార్థం సాయి దుర్గతేజ్ 10 లక్షల రూపాయల విరాళాన్ని ఏపీ సీఎం రిలీఫ్ ఫండ్‌కు ప్రకటించి, ఆ మొత్తాన్ని మంత్రి లోకేష్‌కి రీసెంట్‌గా అందజేసిన విషయం తెలిసిందే. అలాగే విజయవాడలోని అమ్మ అనాథాశ్రమాన్ని స్వయంగా సందర్శిచి, వారి బాగోగులు తెలుసుకున్నారు. అమ్మ ఆశ్రమానికి 2 లక్షల రూపాయలు, ఇతర సేవా సంస్థలకు 3 లక్షల రూపాయల విరాళం అందించారు.

అయితే కేవలం సినిమాల్లోనే కాకుండా నిజ జీవితంలోనూ హీరోగా నిలుస్తూ పలువురికి ఆదర్శంగా నిలుస్తున్న సాయి దుర్గతేజ్ పైన సర్వత్రా ప్రశంసల వర్షం కురుస్తోంది. సమాజం పట్ల, ఇబ్బందుల్లో ఉన్న ప్రజల పట్ల పెద్ద మనసుతో స్పందిస్తున్న ఆయన సేవా గుణాన్ని, మంచి మనసును ప్రతి ఒక్కరూ కొనియాడుతున్నారు.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.