నవ దళపతి సుధీర్ బాబు హోల్సమ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ‘మా నాన్న సూపర్ హీరో’తో అలరించబోతున్నారు. అభిలాష్ రెడ్డి కంకర దర్శకత్వంలో CAM ఎంటర్‌టైన్‌మెంట్, V సెల్యులాయిడ్స్ బ్యానర్‌పై సునీల్ బలుసు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఆర్ణ హీరోయిన్ గా నటించగా.. సాయి చంద్, సాయాజీ షిండే, రాజు సుందరం, శశాంక్, ఆమని, అన్నీ తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇటీవల మేకర్స్ ఫస్ట్-లుక్ పోస్టర్‌ను రిలీజ్ చేసి ప్రమోషన్స్ ప్రారంభించారు. గురువారం సాయంత్రం నేచురల్ స్టార్ నాని ఈ సినిమా టీజర్‌ను లాంచ్ చేశారు. ప్రస్తుతం ఇది ట్రెండింగ్ లో ఉంది. ఈ టీజర్ ను గమనిస్తే.. తన తండ్రితో సుధీర్ బాబుకు ఉన్న డీప్ ఎమోషనల్ బాండ్ ని టీజర్ అద్భుతంగా ప్రజెంట్ చేసింది. సుధీర్ బాబు సాయాజీ షిండే, సాయి చంద్ ఇద్దరినీ నాన్న అని పిలుస్తుంటాడు.
అయితే సాయాజీ షిండే పాత్ర అతని పట్ల అయిష్టత చూపిస్తుండగా, సాయి చంద్ పాత్ర సుధీర్ బాబుతో మంచి అనుబంధం వుంటుంది. తన కొడుక్కి క్యాన్సర్ ఉందనే నెపంతో తన తండ్రి ఒకరి దగ్గర డబ్బు తీసుకున్నాడని తెలిసి సుధీర్ బాబు పాజిటివ్ గా రెస్పాండ్ అవ్వడంతో టీజర్ ఆకట్టుకునేలా ముగిసింది.
తండ్రిని అమితంగా ప్రేమించే కొడుకు పాత్రలో సుధీర్ బాబు కూల్ గా కనిపించారు. సాయాజీ షిండే, సాయి చంద్ విభిన్న పాత్రలలో ఆకట్టుకున్నారు. టీజర్‌లో రాజు సుందరం పాత్రను పరిచయం చేశారు. సాయాజీ షిండే, సాయి చంద్‌లతో సుధీర్ బాబుకు ఉన్న రిలేషన్స్ ఆసక్తిని రేకెత్తిస్తుంది. సినిమాపై అంచనాలను పెంచుతుంది.
ఇక డైరెక్టర్ అభిలాష్ రెడ్డి కంకర మూడు ప్రధాన పాత్రలను ఆకట్టుకునేలా ప్రజెంట్ చేశాడు. సమీర్ కళ్యాణి విజువల్స్ చాలా అందంగా ఉన్నాయి. జై క్రిష్ హార్ట్ టచ్చింగ్ స్కోర్‌తో ఎమోషనల్ అప్పీల్‌ని ఎలివేట్ చేశాడు. ప్రొడక్షన్ వాల్యూస్ టాప్ క్లాస్ లో వున్నాయి.
ఈ చిత్రానికి అనిల్ కుమార్ పి ఎడిటర్, ఝాన్సీ గోజాల ప్రొడక్షన్ డిజైనర్. మహేశ్వర్ రెడ్డి గోజాల క్రియేటివ్ ప్రొడ్యూసర్. అభిలాష్ రెడ్డి కంకర, MVS భరద్వాజ్, శ్రవణ్ మాదాల రైటర్స్ గా పని చేస్తున్నారు. టీజర్ ద్వారా అనౌన్స్ చేసినట్లు, మా నాన్న సూపర్ హీరో అక్టోబర్ 11 న విడుదల కానుంది.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: