దేవర నుంచి ఈసారి.. పాన్ ఇండియా లెవెల్లో వినపడేలా

Devara Team to be Released Ayudha Pooja Track Next Week

మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ టైటిల్ రోల్‌ పోషిస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ ‘దేవర’. బాలీవుడ్ భామ జాన్వీ క‌పూర్ హీరోయిన్‌గా న‌టిస్తుండగా.. మ‌రో బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీఖాన్ భైరా అనే భ‌యంక‌ర‌మైన విలన్ పాత్ర‌లో కనిపించనున్నారు. ప్ర‌కాష్ రాజ్‌, శ్రీకాంత్‌, అజ‌య్, గెట‌ప్ శీను త‌దిత‌రులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. కొరటాల శివ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా కోసం తారక్ అభిమానులు స‌హా అంద‌రూ ఎంతో ఆతృత‌గా వెయిట్ చేస్తున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఎన్టీఆర్ ద్విపాత్రాభిన‌యం చేస్తున్న దేవ‌ర ప్ర‌పంచ వ్యాప్తంగా సెప్టెంబ‌ర్ 27న తెలుగు, హిందీ, త‌మిళ‌, క‌న్న‌డ‌, మ‌లయాళ భాష‌ల్లో గ్రాండ్ రిలీజ్ కానుంది. విడుదలకు మరికొన్ని రోజులే ఉండటంతో యూనిట్ ప్రమోషన్స్‌పై దృష్టి సారించింది. ఈ నేపథ్యంలో ఇటీవలే దేవర థియేట్రికల్ ట్రైలర్‌ను ముంబైలో ఘ‌నంగా లాంచ్ చేసిన విషయం తెలిసిందే. ఇక ఇప్ప‌టి వ‌ర‌కు ఈ సినిమా నుంచి విడుద‌లైన మూడు సాంగ్స్‌కు ఎక్స్‌ట్రార్డిన‌రీ రెస్పాన్స్ వ‌చ్చింది.

ఇదిలావుంటే, తాజాగా దేవర నుంచి మరో సాలిడ్ అప్‌డేట్ వచ్చింది. త్వరలో ఈ మూవీ నుంచి మరో సాంగ్ విడుదలకానుంది. ఈ మేరకు గీత రచయిత రామజోగయ్య శాస్త్రి సోషల్ మీడియా వేదికగా తెలిపారు. “వచ్చేవారం దేవర నుంచి ఆయుధ పూజ ట్రాక్ రిలీజ్ అవుతోంది. పాన్ ఇండియా రేంజ్‌లో బిగ్గెస్ట్ బాంబ్ బ్లాస్ట్ కానుంది” అని అందులో పేర్కొన్నారు. రామజోగయ్య శాస్త్రి ట్వీట్ తర్వాత దేవర 4వ సాంగ్ కోసం అందరూ ఇప్పటినుంచే ఎదురుచూస్తున్నారు.

కాగా దేవర చిత్రం కోసం టాప్ టెక్నీషియ‌న్స్ వ‌ర్క్ చేస్తున్నారు. సినిమాటోగ్రాఫర్‌గా ఆర్‌.ర‌త్న‌వేలు, ఎడిట‌ర్‌గా శ్రీక‌ర్ ప్ర‌సాద్‌, ప్రొడ‌క్ష‌న్ డిజైన‌ర్‌గా సాబు శిరిల్ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. నంద‌మూరి క‌ళ్యాణ్ రామ్ స‌మ‌ర్ప‌ణ‌లో ఎన్టీఆర్ ఆర్ట్స్‌, యువ సుధ ఆర్ట్స్ ప‌తాకాల‌పై మిక్కిలినేని సుధాక‌ర్‌, హ‌రికృష్ణ‌.కె ఈ సినిమాను నిర్మించారు.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.