ఈవారం విడుదలవుతున్న సినిమాలు ఇవే 

These movies will be released this week

ఈ శుక్రవారం బాక్సాఫీస్ వద్ద చిన్న సినిమాలు సందడి చేయనున్నాయి,.అందులో మత్తు వదలరా 2 ,భలే ఉన్నాడే ,కళింగ సినిమాలు వున్నాయి.వీటిలో మత్తువదలరా 2కి ఎక్కువ బజ్ వుంది.మత్తువదలరా కు సీక్వెల్ కావడం సత్య ఉండడం అలాగే ప్రభాస్ ట్రైలర్ లాంచ్ చేయడం తో గట్టిగానే సౌండ్ చేస్తుంది.రితేశ్ రానా తెరకెక్కించిన ఈసినిమాలో సింహ కోడూరి హీరో కాగా సునీల్,వెన్నెల కిషోర్ కీలక పాత్రల్లో నటించారు.కాలభైరవ సంగీతం అందించాడు. 

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక భలే ఉన్నాడే కూడా ప్రామిసింగ్ గా కనిపిస్తుంది.ట్రైలర్ ఆకట్టుకోవడం మారుతి ఓ నిర్మాత గా వ్యవహరిస్తుండడం తో సినిమాపై ఇంట్రెస్ట్ క్రియేట్ అయ్యింది.శివ సాయి వర్ధన్ డైరెక్ట్ చేయగా రాజ్ తరుణ్ హీరోగా నటించాడు.ఇందులో మనీషా కందుకూర్ హీరోయిన్ కాగా వీటీవీ గణేష్ ,గోపరాజు రమణ కీలక పాత్రలు చేశారు.శేఖర్ చంద్ర సంగీతం అందించాడు. 

వీటితో పాటు తెలిసిన కాస్ట్ లేకుండా వస్తుంది కళింగ.ఇక ఇవే  కాకుండా ఈ శనివారం ధనుష్ నటించిన 3 రీ రిలీజ్ అవుతుంది.ఆల్రెడీ ఇంతకుముందే ఓ సారి రీ రిలీజ్ కాగా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇక ఇప్పుడు మళ్ళీ రిలీజ్ అవుతుంది. 

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.