మాలీవుడ్ స్టార్ హీరో టోవినో థామస్ మోస్ట్ ఎవైటెడ్ పాన్ ఇండియా పాంటసీ ప్రాజెక్ట్ ‘ARM’ తో ప్రేక్షకులను ఎంటర్‌టైన్ చేయడానికి సిద్ధంగా వున్నారు. కాగా టోవినోకి ఇది 50వ సినిమా కావడం విశేషం. ఈ మైల్ స్టోన్ మూవీకి డెబ్యుటెంట్ జితిన్ లాల్ దర్శకత్వం వహిస్తున్నాడు. కృతి శెట్టి, ఐశ్వర్య రాజేష్, సురభి లక్ష్మి హీరోయిన్స్‌గా నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని డాక్టర్ జకారియా థామస్‌తో కలిసి మ్యాజిక్ ఫ్రేమ్స్, UGM మోషన్ పిక్చర్స్ బ్యానర్లపై లిస్టిన్ స్టీఫెన్ నిర్మించారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఈ చిత్రాన్ని తెలుగులో మైత్రీ మూవీ మేకర్స్ డిస్ట్రిబ్యూటర్స్ గ్రాండ్‌గా విడుదల చేస్తున్నారు. ARM సెప్టెంబర్ 12న విడుదల కానుంది. దీంతో చిత్ర యూనిట్ ప్రమోషనల్ కార్యక్రమాలను ముమ్మురం చేసింది. ఇందులో భాగంగా ఇప్పటికే విడుదల చేసిన ప్రమోషనల్ కంటెంట్‌కి ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. ఈ నేపథ్యంలో తాజాగా హైదరాబాద్‌లో ‘ARM’ ప్రీరిలీజ్ ఈవెంట్ నిర్వహించారు మేకర్స్.
ఈ ప్రీరిలీజ్ ఈవెంట్‌లో హీరో టోవినో థామస్ చిత్ర విశేషాలను పంచుకున్నారు. టోవినో ఏమన్నారో ఆయన మాటల్లోనే తెలుసుకుందాం.. “అందరికీ నమస్కారం. మైత్రీ మూవీ మేకర్స్ అంటే ఒక బ్రాండ్. వారు మా సినిమాని తెలుగు లో రిలీజ్ చేయడం హానర్ గా భావిస్తున్నాం. దర్శకుడు ఈ కథ చెప్పి మూడు క్యారెక్టర్స్ ప్లే చేయమని అడిగినప్పుడు.. మూడు క్యారెక్టర్స్ ని చేయగలనా? అని అలోచించాను. మరో ఇద్దరు యాక్టర్స్ ని తీసుకోవచ్చు కదా అని అడిగాను.”
“అయితే మూడు పాత్రలని నేనే ఎందుకు చేయాలో వారు చెప్పిన తర్వాత కన్విన్స్ అయ్యాను. ఆక్కడ నుంచి ఈ సినిమా ఒక డ్రీంలా జరిగింది. మరో మూడు రోజుల్లో ఆ డ్రీం నిజం కాబోతోంది. ఈ సినిమాపై మేమంతా చాలా నమ్మకంగా వున్నాం. రోహిణీ మేడం గారితో ఇది నా మూడో సినిమా. తను వండర్ ఫుల్ పెర్ఫార్మర్. హరీష్ తో పని చేయడం మూడోసారి. ఇందులో తన పాత్ర అందరినీ అలరిస్తుంది. ఐశ్వర్య రాజేష్ క్యారెక్టర్ ఈ కథకి డ్రైవ్. తను అద్భుతంగా నటించింది.”
“ఇక కృతి శెట్టి నాకంటే చాలా మెచ్యూర్ గా ఆలోచిస్తుంది. తను తెలుగులో సినిమా చేయమని చెప్పేది. నిన్న ఓ ఫంక్షన్ కి వెళ్ళినప్పుడు ఇక్కడ ప్రజలు ఎంతగా ప్రేమిస్తారో అర్ధమైయింది. ఈ ఇండస్ట్రీలో పార్ట్ అవ్వాలని వుంది. సెప్టెంబర్ 12 “ARM” త్రీడీ థియేటర్స్ లోకి వస్తుంది. అందరూ సినిమాని చూస్తారని ఆశిస్తున్నాను. సినిమా మీకు నచ్చుతుంది. సినిమా మీకు నచ్చితే ప్లీజ్ స్ప్రెడ్ ది వర్డ్. అది మాకు చాలా హెల్ప్ అవుతుంది. థాంక్ యూ సో మచ్” అని అన్నారు హీరో టోవినో థామస్.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: