హిస్టారికల్ బ్యాక్ డ్రాప్ లో యంగ్ హీరో నిఖిల్ నటిస్తున్న సినిమా స్వయంభు.నిఖిల్ కెరీర్ లోనే భారీ బడ్జెట్ తో వస్తుంది.ఈసినిమా కోసం నిఖిల్ ప్రత్యేక శిక్షణ కూడా తీసుకున్నాడు.ఇందులో తను డిఫరెంట్ లుక్ లో కనిపించనున్నాడు.ఇక ఈసినిమాలో ఇద్దరు హీరోయిన్లు నటిస్తున్నారు.అందులో నాభ నటేష్ ఓ హీరోయిన్ కాగా సంయుక్త మీనన్ ను మరో హీరోయిన్ గా తీసుకున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈరోజు సంయుక్త బర్త్ డే కావడంతో ఈసినిమా నుండి తన పోస్టర్ ను రిలీజ్ చేసి బర్త్ డే విషేస్ తెలియజేసింది టీం.ఈపోస్టర్ లో సంయుక్త లుక్ ఆకట్టుకుంది. ఇందులో తను వారియర్ గా కనిపించింది.ఈపాత్ర సంయుక్త కెరీర్ లో గుర్తుండిపోయేలానే వుంది.
భరత్ కృష్ణమాచారి డైరెక్ట్ చేస్తున్న ఈసినిమాకు టాప్ టెక్నీషియన్స్ పనిచేస్తున్నారు.అందులో భాగంగా రవి బస్రుర్ సంగీతం అందిస్తుండగా కెమెరామెన్ గా సెంథిల్ కుమార్ ను తీసుకున్నారు.భువన్, శ్రీకర్ నిర్మిస్తున్నారు.ప్రముఖ నిర్మాత ఠాగూర్ మధు ఈసినిమాకు సమర్పకుడిగా వ్యవహరిస్తున్నారు.స్వయంభు పాన్ ఇండియా మూవీ గా విడుదలకానుంది.వచ్చే ఏడాది ప్రథమార్థంలో థియేటర్లలోకి రానుంది.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: