జనవరి 12న విడుదల.. రేపటి నుంచి మ్యూజికల్ జర్నీ షురూ
January 12 Vidudala Musical Journey Begins Tomorrow

టాలీవుడ్‌లో క్రేజీ ప్రాజెక్ట్‌గా తెరకెక్కుతున్న ‘జనవరి 12 విడుదల’ చిత్రం ప్రమోషన్లలో వేగం పెంచింది. 2027 జనవరి 12న ఈ సినిమాను ప్రపంచవ్యాప్తంగా అత్యంత వైభవంగా విడుదల చేయనున్నట్లు చిత్రబృందం మరోసారి ప్రకటించింది.ఈ నేపథ్యంలో సినిమా పాటలు, సంగీత ప్రచారానికి సంబంధించిన మ్యూజికల్ జర్నీ రేపటి నుంచి ప్రారంభం కానుందని అధికారికంగా వెల్లడించడమే కాకుండా, దానికోసం ఒక ఫన్నీ వీడియోను కూడా విడుదల చేసి ప్రేక్షకులను ఆకట్టుకుంది.
విక్టరీ వెంకటేష్, నందమూరి కళ్యాణ్ రామ్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్నారు. కీర్తి సురేష్, కృతి శెట్టి కథానాయికలుగా నటిస్తుండగా, జీవీ ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్నారు.
ప్రమోషన్లలో ఎప్పుడూ ముందుండే టీమ్, ఈసారి ఫన్నీ ప్రోమో వీడియోతో మ్యూజికల్ కౌంట్‌డౌన్‌ను మరింత సరదాగా మొదలుపెట్టింది.షైన్ స్క్రీన్స్, జీ స్టూడియోస్, సురేష్ ప్రొడక్షన్స్ వంటి ప్రతిష్టాత్మక సంస్థలు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి.
వీడియోస్










