ఈ నగరానికి ఏమైంది రిపీట్ పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను - ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో సురేష్ బాబు
Suresh Babu Wishes ENE Repeat a Big Hit

ఎస్ ఒరిజినల్స్, రూట్‌నోడ్ సినిమా బ్యానర్ల మీద సృజన్ ఎరబోలు, సందీప్ నాగిరెడ్డి నిర్మాణంలో తరుణ్ బాస్కర్ దాస్యం తెరకెక్కించిన చిత్రం ‘ఈ నగరానికి ఏమైంది రిపీట్’. విశ్వక్ సేన్, అభినవ్ గోమటం, శ్రీనాథ్ మాగంటి, వెంకటేష్ కాకుమాను, అనీషా ఆంబ్రోస్, శివాత్మిక రాజశేఖర్ ప్రధాన పాత్రల్లో రూపొందిన ఈ సినిమా నవంబర్ 19న రాబోతోంది. ఈ క్రమంలో మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను మంగళవారం నాడు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో
సురేష్ బాబు మాట్లాడుతూ .. ‘తరుణ్ తన మిత్రబృందంతో కలిసి ‘ఈ నగరానికి ఏమైంది’ సినిమా చేశాడు. రెండో పార్ట్ చేయమని విశ్వక్ సేన్ అన్నాడు. రీ రిలీజ్ గురించి కూడా అతనే చెప్పాడు. రీ రిలీజ్‌లో అద్భుతమైన స్పందన వచ్చింది. ‘ఈ నగరానికి ఏమైంది రిపీట్’ కూడా అదే స్థాయిలో విజయం సాధించాలని కోరుకుంటున్నాను. అందరికీ ఆల్ ది బెస్ట్’ అని అన్నారు.
దిల్ రాజు మాట్లాడుతూ .. ‘‘ఈ నగరానికి ఏమైంది రిపీట్’ టైటిల్ పోస్టర్ వచ్చినప్పటి నుంచే క్రేజ్, హైప్ పెరిగింది. ఆల్రెడీ సినిమా అద్బుతంగా ఉందని టీం చెప్పింది. టీంకు అడ్వాన్స్ కంగ్రాట్స్. తరుణ్ దర్శకుడిగా ఇలాంటి మంచి చిత్రాలు తీస్తూ ఉండాలని కోరుకుంటున్నాను. కనీసం ఏడాదికి ఒక చిత్రమైనా తీయాలని ఆశిస్తున్నాను. సృజన్ క్యాబ్ నడుపుతూ స్కోరీ డిస్కషన్‌లో పాల్గొన్నాడని తెలిసి ఆశ్చర్యపోయాను. ఈ చిత్రం మా ద్వారా రిలీజ్ అవుతుండటం ఆనందంగా ఉంది. ఈ సినిమాతో సృజన్, సందీప్‌కి లాభాలు రావాలి. ‘ఈ నగరానికి ఏమైంది రిపీట్ పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను’ అని అన్నారు.
వీడియోస్










