కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
సినిమా, హీరో, వార్త వెతకండి…అప్‌డేట్స్
వెనక్కి

ఈ నగరానికి ఏమైంది రిపీట్ అందరూ గర్వపడేలా ఈ చిత్రం ఉంటుంది - విశ్వక్ సేన్

ఈ నగరానికి ఏమైంది రిపీట్ అందరూ గర్వపడేలా ఈ చిత్రం ఉంటుంది - విశ్వక్ సేన్

ఈ నగరానికి ఏమైంది రిపీట్ అందరూ గర్వపడేలా ఈ చిత్రం ఉంటుంది - విశ్వక్ సేన్

Vishwak Sen Says ‘e Nagaraniki Emaindi Repeat Will Make Everyone Proud

ఈ నగరానికి ఏమైంది రిపీట్ అందరూ గర్వపడేలా ఈ చిత్రం ఉంటుంది - విశ్వక్ సేన్

ఎస్ ఒరిజినల్స్, రూట్‌నోడ్ సినిమా బ్యానర్ల మీద సృజన్ ఎరబోలు, సందీప్ నాగిరెడ్డి నిర్మాణంలో తరుణ్ బాస్కర్ దాస్యం తెరకెక్కించిన చిత్రం ‘ఈ నగరానికి ఏమైంది రిపీట్’. విశ్వక్ సేన్, అభినవ్ గోమటం, శ్రీనాథ్ మాగంటి, వెంకటేష్ కాకుమాను, అనీషా ఆంబ్రోస్, శివాత్మిక రాజశేఖర్ ప్రధాన పాత్రల్లో రూపొందిన ఈ సినిమా నవంబర్ 19న రాబోతోంది. ఈ క్రమంలో మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌‌ను మంగళవారం నాడు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో

విశ్వక్ సేన్ మాట్లాడుతూ .. ‘‘ఈ నగరానికి ఏమైంది రిపీట్’ మూవీని ఆల్రెడీ టీం అంతా కలిసి చూశాం. సింక్ సౌండ్ కాబట్టి.. డబ్బింగ్‌ ఉండదు, నేరుగా ఫైనల్ కాపీనే చూశాం. సినిమా చూశాక మాటలు రాలేదు. ‘ఈ నగరానికి ఏమైంది’ చిత్రంలో ఒక్కొక్కరు ఒక్కో పాత్రకి కనెక్ట్ అవుతారు. రీ రిలీజ్‌కి కూడా అద్భుతమైన స్పందన వచ్చింది. పార్ట్ 2 తీయమని సురేష్ బాబు గారికి చెప్పాను. రీ రిలీజ్‌లో ఆడియెన్స్ ఇచ్చిన ప్రేమను చూసి ఈ సెకండ్ పార్ట్ చేయాలని తరుణ్ ఫిక్స్ అయ్యాడు. స్నేహం అనేది ఎప్పటికీ నిలిచే ఉంటుంది. సినిమా కనిపెట్టి వంద ఏళ్లు అయిందని అనుకుంటే.. అన్ని బంధాల మీద సినిమాలు తీశారు.

ఫ్రెండ్‌షిప్ కోసం సినిమా రావడానికి ఇన్నేళ్లు పట్టిందా? అని ‘ఈ నగరానికి ఏమైంది రిపీట్’ చూసి షాక్‌లో ఉండిపోయా. కచ్చితంగా ఈ ‘ఈ నగరానికి ఏమైంది రిపీట్’ సినిమా ‘ఈ నగరానికి ఏమైంది’ని రీప్లేస్ చేస్తుంది. మూవీ చూసి బయటకు వెళ్లాక నన్ను వెంటాడింది. నా జీవితంలో ఇదొక బెస్ట్ ఎక్స్‌పీరియెన్స్. ఇందులో చాలా సర్ ప్రైజ్‌లు ఉంటాయి. అందరూ మాస్ బంక్ కొట్టండి. అందరూ గర్వపడేలా ఈ చిత్రం ఉంటుంది. నా కెరీర్‌లో ఇదొక మైల్ స్టోన్ సినిమాగా నిలుస్తుంది. ఇంత వరకు ఎవ్వరూ చెప్పని, చూపించని ఎమోషనల్ డెప్త్‌ని తరుణ్ చూపించాడు. ఈ సినిమాకి, నా లైఫ్‌కి తరుణ్ హీరో’ అని అన్నారు.

వీడియోస్

ఈ నగరానికి ఏమైంది రిపీట్ అందరూ గర్వపడేలా ఈ చిత్రం ఉంటుంది - విశ్వక్ సేన్
సినిమాఈఎన్ఈ రిపీట్ .4 కథనాలు · సినిమా పేజీ →

సంబంధిత వార్తలు

అన్నీ
వాట్సాప్‌లో షేర్ చేయండి

షేర్