బ్లాక్‌బస్టర్ ‘మత్తు వదలరా’కు సీక్వెల్ గా వస్తోన్న ‘మత్తు వదలరా 2’ హ్యుజ్ బజ్ క్రియేట్ చేస్తోంది. యంగ్ హీరో శ్రీ సింహ కోడూరి, సత్య లీడ్ రోల్స్ లో నటిస్తున్నారు. రితేష్ రానా దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్‌లుక్, టీజర్, ప్రమోషనల్ సాంగ్.. ఇలా ప్రతి ప్రమోషన్ మెటీరియల్ కు ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
మైత్రీ మూవీ మేకర్స్ సమర్పణలో క్లాప్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై చిరంజీవి (చెర్రీ), హేమలత పెదమల్లు ఈ చిత్రాన్ని నిర్మించారు. తాజాగా వినాయక చవితి పర్వదినం సందర్భంగా థియేట్రికల్ ట్రైలర్‌ను లాంచ్ చేశారు. రెబెల్ స్టార్ రెబల్ స్టార్ ప్రభాస్ చేతులమీదుగా ఈ ట్రైలర్ విడుదల చేయడం విశేషం.
కాగా హెచ్‌ఈ టీమ్‌లో స్పెషల్ ఏజెంట్లుగా పనిచేస్తున్న శ్రీ సింహ, సత్య, వారు పట్టుకున్న కిడ్నాపర్‌ల నుండి డబ్బును గుంజుతుంటారు. అనుకోకుండా జరిగిన ఓ మర్డర్ తో వారి జీవితం మలుపు తిరుగుతుంది. స్పెషల్ టీం వారిని కోల్డ్ బ్లడెడ్ మర్డర్స్ గా నమ్మి వెంటపడుతుంది.
దర్శకుడు రితేష్ రానా సీక్వెల్ కోసం మరొక అద్భుతమైన నేపథ్యాన్ని ఎంచుకున్నాడు, ప్రతి పాత్ర కీ రోల్ ప్లే చేస్తుంది. నెరేటివ్ రేసీ అండ్ క్రేజీగా ఉంటుంది. స్లేవ్ డ్రగ్ కాన్సెప్ట్ యూనిక్ టర్న్ ని యాడ్ చేస్తోంది. ముఖ్యంగా, టీవీ సీరియల్ ఎపిసోడ్‌లు హిలేరియస్ గా అలరించింది .
ఇక శ్రీ సింహ కోడూరి, సత్య పాత్రలు మోస్ట్ ఎంటర్ టైనింగ్ గా వున్నాయి. ఫరియా అబ్దుల్లా, సునీల్, అజయ్ ప్రజెన్స్ నెరేటివ్ కి అదనపు ఉత్సాహాన్ని, క్రేజీని తెస్తుంది. రోహిణి, ఝాన్సీ సీరియస్ రోల్స్ లో కనిపించారు.
సినిమాటోగ్రాఫర్ సురేశ్ సారంగం, సంగీత దర్శకుడు కాల భైరవ, ఎడిటర్ కార్తీక శ్రీనివాస్ ఆర్ కలిసి వండర్ ఫుల్ ఎక్స్ పీరియన్స్ అందించారు. ఓవరాల్‌గా సెప్టెంబర్ 13న విడుదల కానున్న ఈ సినిమాపై ట్రైలర్ మరింతగా అంచనాలని పెంచింది.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: