నేచురల్ స్టార్ నాని, క్రియేటివ్ డైరెక్టర్ వివేక్ ఆత్రేయ కాంబోలో వచ్చిన లేటెస్ట్ బ్లాక్ బస్టర్ మూవీ ‘సరిపోదా శనివారం’. ప్రియాంక అరుల్ మోహన్ హీరోయిన్‌గా, SJ సూర్య పవర్‌ఫుల్ రోల్‌లో నటించిన ఈ చిత్రాన్ని డివివి ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై డివివి దానయ్య, కళ్యాణ్ దాసరి హై బడ్జెట్, భారీ కాన్వాస్‌తో నిర్మించారు. ఇక ఆగస్ట్ 29న తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో గ్రాండ్‌గా విడుదలైన విషయం తెలిసిందే.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఫస్ట్ షో నుంచే అద్భుతమైన రెస్పాన్స్ అందుకున్న ఈ చిత్రం బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకొని, హౌస్‌ఫుల్ కలెక్షన్స్‌తో సక్సెస్‌ఫుల్‌గా రన్ అవుతోంది. ఈ సందర్భంగా టీమ్ సక్సెస్ మీట్ నిర్వహించింది. నిర్మాత దిల్ రాజు, దర్శకులు హను రాఘవపూడి, శివ నిర్వాణ, రాహుల్ సంకృత్యాన్ ప్రత్యేక అతిధులుగా హాజరయ్యారు. చిత్ర యూనిట్ సభ్యులంతా పాల్గొన్న ఈ విజయ వేడుక చాలా ఘనంగా జరిగింది.
ఈ వేడుకలో నేచురల్ స్టార్ నాని ఉద్వేగంగా మాట్లాడారు. నాని ఏమన్నారో ఆయన మాటల్లోనే చూద్దాం.. “ఈ రోజు ఇక్కడికి వచ్చిన నా పెద్ద ఫ్యామిలీకి.. లవ్ యూ ఆల్. థాంక్ యు సో మచ్. ఈ రోజు ప్రతి టీం మెంబర్ మనసు విప్పి సంతోషంగా మాట్లాడుతుండటం, అది నిజమైన సక్సెస్ కి నిర్వచనం. ఈ వేడుక చూస్తుంటే మనసు నిండిపోయింది. చుట్టూ వరదలు వున్నాయి. చాలా మందికి కష్టంగా వుంది. ఇలాంటి పరిస్థితిలో సరిపోదా శనివారం ఆడియన్స్ కి కొంచెం రిలీఫ్ ఇచ్చింది. బయట చాలా గ్లూమీగా వుంది.”
“కాసేపు మైండ్ దాని నుంచి తీసేయడానికి వాళ్ళందరికీ కొంచెం ఎంటర్ టైన్మెంట్ ఇచ్చిందన్నది ఈ సినిమాకి దక్కిన బిగ్గెస్ట్ సక్సెస్. ఇలాంటి పరిస్థితిలో సినిమాకి బ్రహ్మరధం పట్టిన ఆడియన్స్ కి థాంక్ యూ. కేరళ ప్రమోషన్స్ కి వెళ్ళినప్పుడు ఆక్కడ ఓ టీ షర్టు ఇచ్చి సక్సెస్ ఈవెంట్ లో వేసుకోమని కోరారు. వారికి మాటిచ్చాను. ఆ మాటని నిలబెట్టుకున్నందుకు రిలీఫ్ గా వుంది. వివేక్ సిక్ అయిపోయినప్పుడు నేను కూడా రెండు రోజులు అసిస్టెంట్ డైరెక్టర్ లా పని చేశా. ఈ సక్సెస్ తెలుగు ప్రేక్షకులది. సరిపోదా శనివారం సక్సెస్ వివేక్ అకౌంట్ లోనే వేస్తున్నాను.”
“జెర్సీలో అర్జున్ సక్సెస్ అయితే సత్యరాజ్ ఎంత ఆనందపడతారో వివేక్ సక్సెస్ చూసి నేను అలానే ఆనందపడుతున్నాను. అంటే సుందరానికీ అనే డ్రామా తీశాం. ఇప్పుడు యాక్షన్ ఎంటర్ టైనర్. మళ్ళీ కలసి పని చేసినప్పుడు కామెడీ తీద్దాం. ఆడియన్స్ సీట్లో పడిపడి నవ్వాలి. మళ్ళీ యాక్షన్ సినిమా చేస్తే జేక్స్ బిజోయ్ నే కావాలి. ఆడియన్స్ మ్యూజికల్ ట్రాన్స్ లో వున్నారు. ఎస్జే సూర్య గారి పెర్ఫార్మెన్స్ ని ఒక ప్రేక్షకుడిలా ఎంజాయ్ చేశా. ఇక చారు గా ప్రియాంక అద్భుతంగా నటించింది. శనివారం మాత్రమే రెచ్చిపోయేవాడిని శనివారమోడు అంటారు. సినిమా నచ్చితే రోజూ రెచ్చిపోయేవాళ్ళని తెలుగు ప్రేక్షకులు అంటారు. థాంక్ యూ సో మచ్” అని అన్నారు హీరో నాని.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు :
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:

































