రిజల్ట్ తో సంబంధం లేకుండా వరుసగా సినిమాలు చేస్తూ అనతికాలంలోనే టాప్ బ్యానర్ గా పేరు తెచ్చుకుంది పీపుల్ మీడియా ఫ్యాక్టరీ.ఏడాదికి మూడు లేదా నాలుగు సినిమాలకు తగ్గకుండా చూసుకుంటుంది.భారీ,మీడియం,స్మాల్ బడ్జెట్ సినిమాలని చూడకుండా కంటెంట్ నచ్చితే నిర్మించడానికి ఏమాత్రం వెనకడుగు వేయడం లేదు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఈ బ్యానర్ నుండి వచ్చే నెలలో రెండు వారాల్లో రెండు సినిమాలు రానున్నాయి.అందులో మొదటగా అక్టోబర్ 4న స్వాగ్ విడుదలకానుంది.శ్రీ విష్ణు హీరోగా నటిస్తుండగా హసిత్ గోలి తెరకెక్కిస్తున్నాడు.టీజర్ సినిమాపై అంచనాలు పెంచేసింది.మేకర్స్ సినిమా విజయంపై కాన్ఫిడెంట్ గా వున్నారు.
ఇక ఈసినిమా విడుదలైన వారానికే పీపుల్ మీడియా ఫ్యాక్టరీ మరో సినిమాను దింపుతోంది అదే విశ్వం.గోపీచంద్,శ్రీను వైట్ల కాంబినేషన్ లో వస్తుంది.నిన్న టీజర్ ను రిలీజ్ చేశారు.ఈసినిమాకు వేణు దోనేపూడి మరో నిర్మాతగా వున్నారు.భారీ బడ్జెట్ తో వస్తుంది.మొత్తానికి వారం గ్యాప్ తో వస్తున్న సినిమాలు పీపుల్ మీడియా కు ఎలాంటి రిజల్ట్ ఇస్తాయో చూడాలి.
ఇక ఈ బ్యానర్ నుండి ఈసినిమాలే కాకుండా రెబల్ స్టార్ ప్రభాస్ ది రాజాసాబ్ కూడా రానుంది.దాదాపు 400కోట్ల బడ్జెట్ తో నిర్మితవుతుంది.మారుతి డైరెక్ట్ చేస్తుండగా థమన్ సంగీతం అందిస్తున్నాడు.వచ్చే ఏడాది ఏప్రిల్ 10న రానుంది.ఈసినిమాపై నిర్మాతలు భారీ ఆశలు పెట్టుకున్నారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: