ప్రశాంత్ వర్మ నుంచి త్వరలో అదిరిపోయే అప్‌డేట్

HanuMan Fame Prasanth Varma Next Project Update Will be Coming Soon

‘హనుమాన్’ సినిమాతో ఓవర్ నైట్‌లో నేషనల్ వైడ్‌గా పాపులర్ అయ్యాడు డైరెక్టర్ ప్రశాంత్ వర్మ. సంక్రాంతి కానుకగా ఈ ఏడాది జనవరి 12న విడుదలై 100 రోజులు థియేటర్లలో ప్రదర్శించబడి టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా నిలిచింది. హాలీవుడ్ లోని మార్వెల్స్ తరహాలో భారతీయ తెరపై తొలిసారిగా సూపర్ హీరో క్యారెక్టర్‌ను రూపొందించి సెన్సేషన్ సృష్టించాడు. అయితే దీనికి ఇతిహాసాల నేపథ్యం జోడించడం ప్రేక్షకులను అబ్బురపరిచింది. దీంతో ప్రశాంత్ తదుపరి సినిమాపై అంచనాలు నెక్స్ట్ లెవెల్లో ఉన్నాయి.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఈ నేపథ్యంలో హనుమాన్ విజయంతో దీనికి సీక్వెల్‌గా ‘జై హనుమాన్’ చిత్రాన్ని తెరకెక్కించడానికి ప్రశాంత్ పూనుకున్నాడు. ప్రస్తుతం ఈ మూవీ చిత్రీకరణ దశలో ఉంది. అయితే ఒకవైపు ఇదిలా కొనసాగుతుండగానే మరోవైపు ఆయన తన తదుపరి ప్రాజెక్ట్‌కి సంబంధించి ఫ్యాన్స్‌కు పూనకాలు కలిగించే అప్‌డేట్‌ వచ్చింది. దీని గురించి ఆయనే స్వయంగా సోషల్ మీడియా వేదికగా స్పెషల్ పోస్ట్ పెట్టి తెలియజేశాడు.

విశేషమేమంటే.. ఇందులో టాలీవుడ్‌కు చెందిన ఓ స్టార్ హీరో తనయుడు నటించనున్నాడని తెలుస్తోంది. ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ సినిమాతోనే ఆ స్టార్ కిడ్ అరంగేట్రం చేయబోతున్నాడు. అయితే ఇది కూడా పీవీసీయూ (ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్‌)లో భాగంగా రూపొందనున్నట్టు సమాచారం. అలాగే ఇందులో సదరు స్టార్ హీరో కూడా ఓ కీలక పాత్ర పోషించనున్నాడని అంటున్నారు. త్వరలోనే దీనికి సంబంధించి పూర్తి వివరాలు వెల్లడి కానున్నాయి.

కాగా హనుమాన్ చిత్రంలో యువ నటుడు తేజ సజ్జా హీరోగా నటించగా, అమృతా అయ్యర్ హీరోయిన్‌గా నటించింది. కోలీవుడ్ స్టార్స్ వరలక్ష్మీ శరత్ కుమార్, వినయ్ రాయ్, వెన్నెల కిశోర్, సత్య, గెటప్ శ్రీను తదితరులు కీలక పాత్రలు పోషించారు. శ్రీమతి చైతన్య సమర్పణలో ప్రైమ్‌షో ఎంటర్‌టైన్‌మెంట్‌పై కె నిరంజన్ రెడ్డి నిర్మించారు. తెలుగు, హిందీ సహా రిలీజైన అన్ని భాషల్లోనూ బ్లాక్ బస్టర్ అయిన ఈ మూవీ టోటల్ రన్‌లో రూ. 350 కోట్లుకు పైగా కలెక్షన్స్ వసూలు చేసి రికార్డ్ క్రియేట్ చేసింది.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.