లియో తరువాత తమిళ స్టార్ హీరో విజయ్ నుండి వస్తున్న సినిమా ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైం (ది గోట్).ఇందులో విజయ్ డ్యూయెల్ రోల్ లో కనిపించనున్నాడు.మరో రెండు రోజుల్లో థియేటర్లలోకి రానుంది.విజయ్ సినిమాలకు తమిళంలో వుండే క్రేజ్ గురించి ప్రత్యేకించి చెప్పనవసరం లేదు.ఇప్పుడు ఈ సినిమాకు కూడా క్రేజ్ మాములుగా లేదు.తమిళనాడులో మొదటి రోజు అన్ని షోస్ సోల్డ్ అవుట్ అయ్యాయి.హిట్ టాక్ వస్తే ఓ రేంజ్ లో రచ్చ చేయడం ఖాయం.ట్రెండ్ చూస్తుంటే మొదటి రోజు ఈజీగా 100కోట్ల మార్క్ ను దాటనుంది.ఈసినిమా తమిళ్ తోపాటు తెలుగు,హిందీ లోనూ విడుదలవుతుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
తెలుగులో ఈసినిమాను మైత్రి మూవీ మేకర్స్ విడుదలచేస్తుంది.దాంతో ఇక్కడ కూడా సాలిడ్ ఓపెనింగ్స్ ఖాయంగా కనిపిస్తుంది. ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద పెద్దగా పోటీ లేకపోవడం కూడా కలిసిరానుంది.లియో తెలుగులో కూడా అదరగొట్టింది.దాంతో ది గోట్ పై మంచి అంచనాలు వున్నాయి.నిన్న హైదరాబాద్ లో ప్రీ రిలీజ్ ఈవెంట్ ను కూడా జరిపారు. విజయ్ తప్ప మిగితా కాస్టింగ్ హాజరయ్యారు.ఎర్లీ మార్నింగ్ షోస్ పర్మిషన్ కోసం మైత్రి దరఖాస్తు చేశారని సమాచారం.వినాయక చవితి హాలిడే కూడా అడ్వాంటేజ్ కానుంది.
వెంకట్ ప్రభు తెరకెక్కించిన ఈసినిమాలో స్నేహ,మీనాక్షి చౌదరి హీరోయిన్లు గా నటించగా ప్రశాంత్,ప్రభుదేవా,అజ్మల్, లైలా,మీనాక్షి చౌదరీ,యోగిబాబు,వీటీవీ గణేష్,జయరామ్ కీలక పాత్రలు పోషించారు.యువన్ శంకర్ రాజా సంగీతం అందించాడు.400కోట్ల బడ్జెట్ తో ఏజిఎస్ ఎం టెన్ టైన్మెంట్ ఈసినిమాను నిర్మించింది.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు :
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: