నాగార్జున చేతులమీదుగా.. 35-చిన్న కథ కాదు ట్రైలర్ లాంచ్

King Nagarjuna Unveiled 35-Chinna Katha Kaadu Trailer

మలయాళ ముద్దుగుమ్మ నివేదా థామస్, ప్రియదర్శి, విశ్వదేవ్, గౌతమి, భాగ్యరాజ్ లీడ్ రోల్స్‌లో నటించిన న్యూ ఏజ్ క్లీన్ ఎంటర్‌టైనర్ ’35-చిన్న కథ కాదు’. సురేష్ ప్రొడక్షన్స్, ఎస్ ఒరిజినల్స్, వాల్టెయిర్ ప్రొడక్షన్స్ బ్యానర్లపై రానా దగ్గుబాటి, సృజన్ యరబోలు, సిద్ధార్థ్ రాళ్లపల్లి నిర్మిస్తున్న ఈ చిత్రానికి నంద కిషోర్ ఈమాని రైటర్ డైరెక్టర్.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

న్యూ ఏజ్ క్లీన్ ఫ్యామిలీ డ్రామాగా రూపొందిన ఈ మూవీ ఇప్పటికే టీజర్, పాటలతో బజ్ క్రియేట్ చేసింది. ఈ నేపథ్యంలో తాజాగా ఈ సినిమా ట్రైలర్‌ విడుదలయింది. కింగ్ నాగార్జున చేతులమీదుగా ఈ ట్రైలర్‌ లాంచ్ అవడం విశేషం.

మ్యాథ్స్ సబ్జెక్ట్ తో ఇబ్బంది పడుతున్న ఓ స్టూడెంట్ ని పరిచయం చేస్తూ ట్రైలర్ ఓపెన్ అయ్యింది. తల్లిదండ్రుల పాత్రలు పోషించిన నివేద థామస్, విశ్వదేవ్ ఆ చిన్నన పిల్లాడి భవిష్యత్ విషయంలో ఆందోళన చెందుతుంటారు. ఆ పిల్లాడిని ఫ్రెండ్స్, టీచర్స్’ సున్నా’ అని పిలుస్తుంటారు. చిన్న పిల్లవాడు సవాళ్లను అధిగమించి, 35 మార్కులతో ఉత్తీర్ణత సాధించగలిగాడా అనేది కథలో ప్రధానాంశం.

దర్శకుడు నంద కిషోర్ ఈమని చాలా ఎఫెక్టివ్ గా సబ్జెక్ట్ ని హ్యాండిల్ చేశారు. అందరికీ కనెక్ట్ అయ్యే కథని అద్భుతంగా ప్రజెంట్ చేశ్రని టీజర్ చూస్తే అర్ధమౌతోంది. విశ్వదేవ్, నివేదా థామస్ మధ్యతరగతి తల్లిదండ్రులుగా తమ నేచురల్ పెర్ఫార్మెన్స్ తో కట్టిపడేశారు. ప్రియదర్శి, గౌతమి , భాగ్యరాజ్ తమ పాత్రల ద్వారా కథకు డెప్త్ ని యాడ్ చేశారు.

సినిమాటోగ్రాఫర్ నికేత్ బొమ్మి గ్రామీణ నేపథ్యాన్ని ఎఫెక్టివ్‌గా తీశారు. వివేక్ సాగర్ అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ కథనాన్ని అందంగా తీర్చిదిద్దింది. లతా నాయుడు ప్రొడక్షన్ డిజైన్ టాప్ క్లాస్ లో వుంది. టీసీ ప్రసన్న ఎడిటింగ్ బ్రిలియంట్ గా వుంది. మొత్తానికి ఈ ట్రైలర్ సినిమాపై అంచనాలను పెంచింది. 35-చిన్న కథ కాదు సెప్టెంబర్ 6న తెలుగు, తమిళం, మలయాళ భాషల్లో విడుదల కానుంది.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.