సూపర్ స్టార్ రజనీకాంత్, తమిళ అగ్ర దర్శకుడు లోకేష్ కనగరాజ్ కాంబినేషన్‌లో రూపొందుతోన్న లేటెస్ట్ మూవీ ’కూలీ’. ఈ మూవీకి సౌత్ ఇండియన్ మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ ఈ చిత్రానికి సంగీతం అందించనున్నారు. సన్‌పిక్చర్స్ బ్యానర్‌పై కళానిధిమారన్ ఈ సినిమాను భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ చిత్రం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ వైజాగ్ లో జరుగుతోంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇదిలావుంటే, తలైవా 171గా తెరకెక్కుతోన్న ఈ సినిమాలో స్టార్ కాస్టింగ్ భాగం కానున్నారు. దీనిలో భాగంగా ఈ సినిమాలో నటించనున్న ఆయా నటీనటుల పాత్రలకు సంబంధించి మేకర్స్ ఒక్కో అప్డేట్ అందిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే మలయాళ నటుడు, మంజుమ్మెల్ బాయ్స్ ఫేం సౌబిన్ షాహిర్‌తో పాటు అక్కినేని నాగార్జున, శృతి హాసన్, సత్య రాజ్ పాత్రలను రివీల్ చేసిన మేకర్స్ తాజాగా మరో పాత్రను రివీల్ చేశారు.
కన్నడ సూపర్ స్టార్ ఉపేంద్ర ‘కలీషా’ అనే పాత్రలో నటించబోతున్నట్టు చిత్రబృందం ప్రకటించింది. ఈ సందర్భంగా డైరెక్టర్ లోకేష్ ఉపేంద్ర ఫస్ట్ లుక్‌ను విడుదల చేశారు. మంచి రగ్గ్ డ్ లుక్ లో ఉపేంద్ర మాసీ స్టైల్ లో కనిపిస్తున్నాడు. ఈ వరుస అప్డేట్స్ తో కూలీ క్యాస్టింగ్ సినిమాపై రోజు రోజుకి అంచనాలు పెంచేస్తుంది. కాగా వచ్చే ఏడాది కూలీ థియేటర్లలోకి రానుంది.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: