మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, ఉపాసన దంపతులు ఒకవైపు వృత్తిపరంగా ఎంత బిజీగా ఉంటున్నప్పటికీ మరోవైపు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటుంటారు. సినిమాల గురించే కాకుండా తమ ఇంట జరిగే ప్రతి పండుగను, వేడుకను అభిమానులతో పంచుకుంటారు. అలాగే వారి ముద్దుల తనయ, మెగా ప్రిన్స్ క్లీంకార గురించి కూడా అప్పుడప్పుడు కొన్ని పిక్స్ షేర్ చేస్తుంటారు. అయితే ఫోటోలలో పాప ముఖం కనిపించకుండా పలు జాగ్రత్తలు తీసుకుంటారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
తాజాగా చరణ్, ఉపాసన దంపతుల ఇంట శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకల్లో వారి ముద్దులపట్టి క్లీంకార కూడా పాల్గొని సందడి చేసింది. ఈ సందర్భంగా తమ ఇంటి పూజ గదిలో కృష్ణుడి పూజలో పాల్గొని ఆసక్తిగా తిలకించింది. ఇందుకు సంబంధించిన చిత్రాన్ని ఉపాసన కొణిదెల సోషల్ మీడియాలో పంచుకోగా అది వైరల్ అవుతోంది.
ఈ ఫొటోకు మెగా ఫ్యాన్స్ సోషల్ మీడియాలో వివరీతంగా షేర్స్ చేస్తూ లైక్స్ కొడుతూ తమ పేవరెట్ హీరో తనయపై ఓ రేంజ్‌లో అభిమానం చూపిస్తున్నారు. ఇక గత జూన్ నెలలో ఫాదర్స్ డే సందర్భంగా రామ్ చరణ్ తన గారాల పట్టిని ఆడిస్తున్న ఫొటోను సోషల్ మీడియా వేదికగా షేర్ చేయగా అది కూడా విపరీతంగా వైరల్ అయిన విషయం గుర్తుండేవుంటుంది.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: