మ్యాడ్ సినిమాతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చాడు నార్నే నితిన్ ఇప్పుడు రెండో సినిమాతో వచ్చాడు. అంజి కే దర్శకత్వంలో యూత్ ఫుల్ ఎంటర్ టైనర్ గా వచ్చిన ఈసినిమా ఎన్నో అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇక ఈసినిమా మంచి టాక్ ను సొంతం చేసుకుంది. విశేషం ఏంటంటే మిస్టర్ బచ్చన్, డబుల్ ఇస్మార్ట్, తంగలాన్ తో పాటు ఇంకా పలు పెద్ద సినిమాలు బాక్సాఫీస్ వద్ద పోటీగా ఉన్నా కూడా చిన్న సినిమా అయినా ఆయ్ ఎక్కడా తగ్గకుండా బరిలోకి దిగింది. అయితే ఈసినిమాపై అంచనాలను ఎక్కడా తగ్గించకుండా ఆయ్ సినిమా పాజిటివ్ టాక్ ను దక్కించుకుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇదిలా ఉండగా ఈసినిమా నుండి ఇప్పుడు ఇంట్రెస్టింగ్ అప్ డేట్ వచ్చింది. ఈసినిమా ఓటీటీ పార్టనర్ ను లాక్ చేసుకున్నట్టు వార్తలు వస్తున్నాయి. ప్రముఖ ఓటీటీ సంస్థ అయిన నెట్ ఫ్లిక్స్ వారు ఈసినిమా ఓటీటీ హక్కులను సొంతం చేసుకున్నట్టు తెలుస్తుంది. త్వరలోనే ఓటీటీలోకి రాబోతున్నట్టు సమాచారం. మరి దీనిపై క్లారిటీ రావాలంటే అధికారిక ప్రకటన వచ్చేంతవరకూ ఆగాల్సిందే.
కాగా ఈసినిమాలో నయన్ సారిక హీరోయిన్ గా నటించగా రాజ్‌కుమార్ కసిరెడ్డి, అంకిత్ కొయ్య తదితరులు కీలక పాత్రల్లో నటించారు. GA2 పిక్చర్స్ బ్యానర్ పై బన్నీ వాస్, విద్యా కొప్పినీడి నిర్మించారు. రామ్ మిరియాల సంగీతం అందించగా.. సమీర్ కళ్యాణి సినిమాటోగ్రాఫర్ గా, కోదాటి పవన్ కళ్యాణ్ ఎడిటర్ గా పనిచేశారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: