నేచురల్ స్టార్ నాని, వివేక్ ఆత్రేయ మోస్ట్ అవైటెడ్ పాన్ ఇండియా ఫిల్మ్ ‘సరిపోదా శనివారం’. ప్రియాంక అరుల్ మోహన్ కథానాయికగా నటిస్తుండగా.. SJ సూర్య, సాయికుమార్, అజయ్, అదితిబాలన్, మురళీ శర్మ, అజయ్ ఘోష్, హర్షవర్ధన్, శుభలేఖ సుధాకర్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఈ అడ్రినలిన్ ఫిల్డ్ యాక్షన్-అడ్వెంచర్ ఇప్పటికే ప్రతి ప్రమోషనల్ కంటెంట్‌తో హ్యుజ్ బజ్ క్రియేట్ చేసింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
తాజాగా హైదరాబాద్ లోని సుదర్శన్ 35 MM థియేటర్లో భారీగా తరలివచ్చిన అభిమానుల మధ్య సినిమా థియేట్రికల్ ట్రైలర్‌ను లాంచ్ చేశారు. టీజర్ సినిమాలోని రెండు ఇంపార్టెంట్ క్యారెక్టర్స్‌ని పరిచయం చేయగా, ట్రైలర్ కాన్ఫ్లిక్ట్ని ప్రజెంట్ చేసింది. గ్రిప్పింగ్ ట్రైలర్ ఇంపాక్ట్ ఫుల్ స్టొరీ మెయిన్ పార్ట్‌ని రివిల్ చేస్తోంది. అదిరిపోయే నెరేటివ్‌తో మొదటి నుండి చివరి వరకు ఆడియన్స్‌ని కట్టిపడేసింది.
ఇక ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో నేచురల్ స్టార్ నాని మాట్లాడుతూ.. “సుదర్శన్ థియేటర్ నాకు చాలా స్పెషల్. మీ అందరితో కలసి ఈ ట్రైలర్ చూడటం చాలా హ్యాపీగా వుంది. ఈ మంత్ ఎండ్‌కి అదిరిపోతుంది. మీ అందరితో కలసి సినిమా ఇక్కడే చూస్తాను. మీ అందరి ప్రేమకి థాంక్స్. మీరు ఇలానే ప్రేమ చూపిస్తూ వుంటే వందశాతం కష్టపడి మీకు మంచి మంచి సినిమాలు ఇవ్వడానికి ప్రయత్నిస్తునే వుంటాను” అని తెలిపారు.
ఇంకా ఆయన మాట్లాడుతూ.. “ఈ సినిమా నుంచి ఒక డైలాగ్ చెప్పాలంటే.. ‘నాకు కోపం వచ్చింది, నాకు కోపం వచ్చిందటే వీళ్ళు నా మనుషులు, వాళ్ళ సమస్య నా సమస్య. వాళ్ళ సంతోషం నా సంతోషం’. అందుకే ఈ ఆనందాన్ని సెలబ్రేట్ చేసుకోవడానికి ఇక్కడికి వచ్చాను. ఇక సెలబ్రేట్ చేసుకుంటూనే ఉందాం. థాంక్ యూ సో మచ్. ఆగస్ట్ 29న సరిపోదా శనివారం. థియేటర్స్‌లో సెలబ్రేట్ చేసుకుందాం” అని అన్నారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు :
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:

































