మాస్ మహారాజ్ రవితేజ-హరీష్ శంకర్ ల కాంబోలో తెరకెక్కిన మిస్టర్ బచ్చన్ మరో రెండు రోజుల్లో థియేటర్లలోకి రానుంది.అయితే సినిమా మీద వున్న నమ్మకంతో ఒక రోజు ముందే పెయిడ్ ప్రీమియర్లు వేయనున్నారు.ఇక వీటికి ఊహించని రెస్పాన్స్ వస్తుంది.దాంతో ఎక్స్ట్రా షోస్ కూడా ఆడ్ చేయనున్నారు.సాంగ్స్ ఈసినిమాకు చాలా బూస్ట్ ఇచ్చాయి.క్లాసిక్ ఆల్బమ్స్ ఇచ్చే మ్యూజిక్ డైరెక్టర్ మిక్కీ జె మేయర్ నుండి ఈ తరహా ఆడియో జనాలు ఊహించలేదు.నిన్న రిలీజైన నల్లంచు తెల్లచీర సాంగ్ కూడా అదిరిపోయింది.థియేటర్లలో ఈ సాంగ్ దుమ్మురేపడం ఖాయం.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఓవరాల్ గా పర్ఫెక్ట్ కమర్షియల్ ఎంటర్టైనర్ గా వస్తుంది మిస్టర్ బచ్చన్.పేరుకే హిందీ రైడ్ కు రీమేక్ కానీ హరీష్ శంకర్ చాలా మార్పులు చేసి తీశాడు.రీమేక్ సినిమాలు తీయడం లో హరీష్ ది ప్రత్యేకమైన శైలి.ఒరిజినల్ ను డామినేట్ చేసేలా తీస్తాడు. దాంతో మిస్టర్ బచ్చన్ పై చాలా హైప్ క్రియేట్ అయ్యింది.
ఇక ఈసినిమా ద్వారా భాగ్య శ్రీ బోర్సే తెలుగులో హీరోయిన్ గా పరిచయమవుతుంది.ఈసినిమాతో ఇప్పటికే తనకు మంచి ఫాలోయింగ్ కూడా వచ్చింది.రిలీజ్ తరువాత ఆమెకు ఆఫర్లు క్యూ కట్టనున్నాయి.పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ఈసినిమాను నిర్మించింది.ఈసంస్థకు కూడా సాలిడ్ హిట్ అవసరం కానుంది.అయితే ఈమిస్టర్ బచ్చన్ ఆ హిట్ ఇచ్చేలానే వుంది.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: