డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్,ఉస్తాద్ రామ్ కాంబినేషన్ లో వస్తున్న సినిమా డబుల్ ఇస్మార్ట్.మరో వారం రోజుల్లో థియేటర్లలోకి రానుంది.అందులో భాగంగా ఈసినిమా సెన్సార్ కార్యక్రమాలు కూడా పూర్తయ్యాయి.సెన్సార్ బోర్డు ఏ సర్టిఫికేట్ ఇచ్చిందని సమాచారం.అంతేకాదు సెన్సార్ సభ్యులనుండి సినిమా బాగుందని పాజిటివ్ రెస్పాన్స్ వచ్చిందట.ఇంటర్వెల్,క్లైమాక్స్ ఎపిసోడ్ లు సూపర్ అని అమ్మసెంటిమెంట్ కూడా బాగా వర్క్ అవుట్ అయ్యిందని టాక్.2 గంటల 42నిమిషాల నిడివితో ఈసినిమా థియేటర్లలోకి రానుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఈసినిమాకు సూపర్ హైప్ వుంది.సాంగ్స్ ,ట్రైలర్ సూపర్ రెస్పాన్స్ తెచ్చుకున్నాయి.మరోవైపు పూరి జగన్నాథ్ అలాగే రామ్ కు ఈసినిమా విజయం కీలకం కానుంది.వీరిద్దరి లాస్ట్ సినిమాలు అనుకున్నంతగా ఆడలేదు.డబుల్ ఇస్మార్ట్ మాత్రం వీరికి కావాల్సిన విజయాన్ని అందించేలా వుంది.అయితే అన్ని పాజిటివ్ వైబ్స్ మధ్య విడుదలవుతున్న ఈసినిమాకు బాక్సాఫీస్ వద్ద మాత్రం పోటీ ఎదురుకానుంది.ఈనెల 15న చాలా సినిమాలు విడుదలకానున్నాయి అయితే మేజర్ గా డబుల్ ఇస్మార్ట్, మిస్టర్ బచ్చన్ తో క్లాష్ ను ఎదుర్కోనుంది.
మాస్ ఎంటర్టైనర్ గా వస్తున్న ఈసినిమాలో డబుల్ ఇస్మార్ట్ లో కావ్య థాపర్ హీరోయిన్ గా నటించగా సంజయ్ దత్ విలన్ పాత్రలో కనిపించనున్నాడు.మణిశర్మ సంగీతం అందిస్తున్నాడు.పూరి జగన్నాథ్,ఛార్మి నిర్మిస్తున్నారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: