దళపతి విజయ్ వరుసగా సినిమాలు చేసుకుంటూ వెళుతున్నాడు. ప్రస్తుతం తన నుండి వస్తున్న సినిమా గోట్ (గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్). వెంకట్ ప్రభు దర్శకత్వంలో ఈసినిమా వస్తున్న సంగతి తెలిసిందే. పీరియాడిక్ సైన్స్ ఫిక్షన్ నేపథ్యంలో వస్తున్న ఈసినిమాలో విజయ్ డ్యూయల్ రోల్ లో కనిపించనున్నాడు. ఈసినిమా షూటింగ్ ను పూర్తి చేసుకొని ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులను పూర్తి చేసుకునే పనిలో ఉంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇదిలా ఉండగా ఈసినిమా రిలీజ్ హక్కులకు సంబంధించి పలు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే కదా. ఈ సినిమా తెలుగు రిలీజ్ హక్కులు టాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థ అయిన మైత్రీ మూవీ మేకర్స్ వారు సొంతం చేసుకున్నట్టు ఆమధ్య వార్తలు వచ్చాయి. అయితే ఇప్పుడు దీనిపై క్లారిటీ వచ్చేసింది. ఈసినిమా రెండు తెలుగు రాష్ట్రాల హక్కులతో పాటు నార్త్ రిలీజ్ హక్కులను అలానే తమిళ్ రిలీజ్ హక్కులను ఓ నోటెడ్ కంపెనీ దక్కించుకున్నట్టు తెలుస్తుంది. ఆ ప్రొడక్షన్ హౌస్ మరేదో కాదు. జీ స్టూడియోస్ వారు ఈ అవకాశాన్ని దక్కించుకున్నారు. ఈ విషయాన్ని చిత్రయూనిట్ అధికారికంగా ప్రకటించారు.
కాగా సినిమాలో విజయ్ కు జోడీగా మీనాక్షి చౌదరి హీరోయిన్ గా నటిస్తుండగా స్నేహ, ప్రశాంత్, ప్రభుదేవా, జైరాం, లైలా, కమెడియన్, అజ్మల్, యోగిబాబు, వైభవ్ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈసినిమాను ఏజీఎస్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్ పై అర్చన కల్పతి నిర్మిస్తున్నారు. యువన్‌శంకర్ రాజా సంగీతం అందిస్తున్నాడు. తమిళంతో పాటు తెలుగు, హిందీ భాషల్లో సెప్టెంబర్ 5వ తేదీన ఈసినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: