యంగ్ టైగర్ ఎన్టీఆర్ కొత్త సినిమాతో థియేటర్లలో కనిపించి దాదాపు రెండేళ్లు దాటిపోయింది.సోలో హీరోగా అయితే ఆరేళ్ళకు వస్తుంది.ఒకవైపు ప్రభాస్ ఏడాదికి రెండు సినిమాలతో వస్తుంటే ఈ లాంగ్ గ్యాప్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ను నిరుత్సాహపరిచింది.అయితే ఇక వారికి తమ ఫేవరేట్ హీరో సినిమా కోసం ఎదురుచూసే పరిస్థితి ఉండదు. ఈ ఏడాది తోకలిపి రానున్న రెండేళ్ల లో మూడు సినిమాలతో రానున్నాడు. అందులో భాగంగా ఈఏడాది సెప్టెంబర్ లో దేవర ఫస్ట్ పార్ట్ విడుదలకానుంది.షూటింగ్ కూడా ఆల్మోస్ట్ కంప్లీట్ అయ్యింది.కొరటాల శివ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఈసినిమాపై భారీ అంచనాలు వున్నాయి.ఇప్పటివరకు రిలీజ్ చేసిన రెండు సాంగ్స్ కూడా సూపర్ రెస్పాన్స్ తెచ్చుకున్నాయి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఈసినిమాతో పాటు ప్రస్తుతం ఎన్టీఆర్ హిందీలో వార్ 2 చేస్తున్నాడు.హృతిక్ రోషన్ మరో హీరోగా నటిస్తున్నాడు.రీసెంట్ గా ఎన్టీఆర్ ఓ షెడ్యూల్ షూటింగ్ కూడా పూర్తి చేశాడు.బ్రహస్త్ర ఫేమ్ ఆయన ముఖర్జీ డైరెక్ట్ చేస్తుండగా యాష్ రాజ్ ఫిలిమ్స్ నిర్మిస్తుంది.ఈసినిమాను వచ్చే ఏడాది ఆగస్టు 15న రిలీజ్ చేయాలని ప్లాన్ లో వున్నారు.డేట్ అయితే మారొచ్చు కానీ వచ్చే ఏడాది రిలీజ్ మాత్రం పక్కా.
ఇక ఈరోజు ప్రశాంత్ నీల్ తో ఎన్టీఆర్ చేయనున్న సినిమాకూడా లాంచ్ అయ్యింది.ఎన్టీఆర్ కు 31వ సినిమా ఇది.త్వరలోనే సెట్స్ మీదకు వెళ్లనుంది.రిలీజ్ డేట్ కూడా ప్రకటించేశారు. 2026 జనవరి 9న విడుదలకానుంది.సో ఎన్టీఆర్ ఈ మూడు సంవత్సరాల్లో మూడు సినిమాలతో పలకరించనున్నాడు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు :
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: