అక్కినేని వారింట పెళ్ళి బాజాలు మోగనున్నాయి. యువ సామ్రాట్ నాగచైతన్య త్వరలో వివాహం చేసుకోనున్నారు. హీరోయిన్ శోభితా ధూళిపాళ్లతో ఆయన ఏడడుగులు వేయబోతున్నారు. ఈ నేపథ్యంలో గురువారం వీరి నిశ్చితార్ధం జగింది. దీనిపై చైతూ తండ్రి, స్టార్ హీరో అక్కినేని నాగార్జున అధికారికంగా ప్రకటించారు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా ఆయన ఓ పోస్ట్ పెట్టారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈ సందర్భంగా ఎక్స్ వేదికగా.. “ఈ రోజు ఉదయం 9:42 గంటలకు జరిగిన మా కొడుకు నాగ చైతన్య నిశ్చితార్థం శోభిత ధూళిపాళతో జరిగినట్లు తెలియజేసేందుకు మేము సంతోషిస్తున్నాము!! ఆమెను మా కుటుంబంలోకి స్వాగతిస్తున్నందుకు మేము చాలా సంతోషిస్తున్నాము. సంతోషకరమైన జంటకు అభినందనలు! వారికి జీవితాంతం ప్రేమ, సంతోషం కలగాలని కోరుకుంటున్నాను. దేవుడు ఆశీర్వదిస్తాడు!. 8.8.8.. అనంతమైన ప్రేమకు నాంది” అని అందులో నాగార్జున పేర్కొన్నారు.
కాగా నాగచైతన్య, శోభితా ధూళిపాళ్ల ప్రేమలో ఉన్నారని, వారిద్దరు చెట్టాపట్టాలేసుకు తిరుగుతున్నారని గత కొంత కాలంగా వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. ఈ ప్రచారానికి నేటితో తెరపడనుంది. అయితే చైతూ-శోభితా పెళ్లి చేసుకోబోతున్నారని, గురువారం వీరి ఎంగేజ్‌మెంట్ జరుగనుందనీ బుధవారం రాత్రి నుంచే ఒక వార్త నెట్టింట బాగా వైరలయింది.
ఈ క్రమంలో దీనిని నిజం చేస్తూ నాగార్జున నేడు స్వయంగా ప్రకటించారు. తాజాగా జరిగిన ఈ వేడుకలో ఇరు కుటుంబాల పెద్దల సమక్షంలో చైతూ-శోభితా ఉంగరాలు మార్చుకున్నారు. అయితే ఈ కార్యక్రమానికి అతి కొద్దిమంది అతిథులు మాత్రమే హాజరయినట్టు సమాచారం.
ఇక ఇదిలావుంటే.. నాగచైతన్య, స్టార్ హీరోయిన్ సమంతను గతంలో వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. అయితే అనుకోని కారణాల వలన వారిరువురూ విడాకులు తీసుకున్నారు. ఇది ఇద్దరు అభిమానులను చాలా బాధించింది. ఆ తర్వాత ఎవరికి వారు సినిమాలు చేసుకుంటూ తమ కెరీర్‌లో ముందుకు సాగుతున్నారు. ఈ తరుణంలో చైతన్య మరో హీరోయిన్ శోభితా ధూళిపాళ్లను పెళ్లి చేసుకోనుండటం సర్వత్రా ఆసక్తిని కలిగిస్తోంది.
ఇక నాగచైతన్య సినిమాల విషయానికొస్తే.. ప్రస్తుతం ఆయన క్రియేటివ్ డైరెక్టర్ చందూ మొండేటి దర్శకత్వంలో ‘తండేల్’ మూవీలో నటిస్తున్నాడు. సాయిపల్లవి ఫీ మేల్ లీడ్ రోల్ పోషిస్తున్న ఈ సినిమాకు దేవి శ్రీ ప్రసాద్ సంగీతం సమకూరుస్తున్నాడు. గీతా ఆర్ట్స్‌పై అగ్ర నిర్మాత అల్లు అరవింద్ సమర్పణలో బన్నీవాసు నిర్మిస్తున్న తండేల్ క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 20న గ్రాండ్ రిలీజ్ కానుంది.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: