మాస్ మహారాజా రవితేజ, హరీష్ శంకర్ కాంబోలో వస్తోన్న మోస్ట్ అవైటెడ్ మూవీ ‘మిస్టర్ బచ్చన్’. భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్‌గా నటిస్తుండగా.. జగపతి బాబు పవర్ ఫుల్ పాత్రలో కనిపిస్తున్నారు. మిక్కీ జె మేయర్ సాంగ్స్ అండ్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ సమకూర్చగా.. అయనంక బోస్ సినిమాటోగ్రఫీ అందించారు. ప్రొడక్షన్ డిజైనర్‌గా బ్రహ్మ కడలి, ఉజ్వల్ కులకర్ణి ఎడిటింగ్ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టిజి విశ్వ ప్రసాద్ ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఈ చిత్రం ఆగస్టు 15న విడుదలవుతోంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈ నేపథ్యంలో మిస్టర్ బచ్చన్ ప్రమోషన్ కార్యక్రమాలు జోరుగా సాగుతున్నాయి. ఇప్పటికే విడుదల చేసిన టీజర్, పాటలు హ్యుజ్ బజ్ క్రియేట్ చేశాయి. ఇక తాజాగా మేకర్స్ థియేట్రికల్ ట్రైలర్‌ను లాంచ్ చేసిన విషయం తెలిసిందే. ఇందులో రవితేజ మాగ్నెటిక్ ప్రెజెన్స్ మరియు ఆయన చెప్పిన పవర్ ఫుల్, ఇంపాక్ట్ ఫుల్ డైలాగ్స్ సినిమాపై అంచనాలను పెంచేసాయి. గ్రాండ్‌గా జరిగిన ఈ ఈవెంట్‌లో చిత్ర యూనిట్ అంతా పాల్గొని సందడి చేసింది.
ఈ సందర్భంగా డైరెక్టర్ హరీష్ శంకర్ మాట్లాడుతూ.. “రవితేజ గారు నా ఫస్ట్ సినిమా చేసినప్పుడు ఎలా వున్నారో ఇప్పటికీ అలానే వున్నారు. ఏం చేంజ్ అవ్వలేదు. ‘మిరపకాయ్’ సక్సెస్ మా కాంబినేషన్ పై అంచనాలు పెంచింది. ఆ అంచనాలు దాటే సినిమా మిస్టర్ బచ్చన్ అవుతుందనే నమ్మకం వుంది. మిరపకాయ్ కి సినిమా రవితేజ గారే టైటిల్ పెట్టారు. ఈ సినిమాకి కూడా ఆయనే టైటిల్ పెట్టారు” అని తెలిపారు.
ఇంకా ఆయన మాట్లాడుతూ.. “భాగ్యశ్రీ బోర్సే తెలుగు నేర్చుకొని మరీ డబ్బింగ్ చెప్పింది. తను చాలా హార్డ్ వర్క్ చేసింది. తన క్యారెక్టర్ ని మ్యాచ్ చేసింది. ఆగస్ట్ 15న అమితాబ్ బచ్చన్ గారి షోలే సినిమా రిలీజైయింది. రవితేజ గారి బచ్చన్ అదే డేట్ కి రావడం ప్యూర్ కో-ఇన్సిడెంట్. ఇది అనుకోకుండా వచ్చింది కాబట్టి ట్రైలర్ లో యాడ్ చేశాం. ఆగస్ట్ 15న మా సినిమాతో పాటు డబుల్ ఇస్మార్ట్ వస్తోంది. రెండు సినిమాలని బ్లాక్ బస్టర్ చేయాలి” అని కోరారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: