మెగా డాటర్ నిహారిక కొణిదెల సమర్పణలో పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ ఎల్.ఎల్.పి, శ్రీరాధా దామోదర్ స్టూడియోస్ బ్యానర్స్‌పై రూపొందిన ‘కమిటీ కుర్రోళ్ళు’ సినిమాకు యదు వంశీ దర్శకుడు. అంతా కొత్త వారితో చేస్తున్న ఈ చిత్రం ఇప్పటికీ అందరిలోనూ అంచనాలు పెంచేసింది. ఆగస్ట్ 9న రిలీజ్ కాబోతున్న కమిటీ కుర్రోళ్ళు చిత్రాన్ని తెలుగు రాష్ట్రాల్లో వంశీ నందిపాటి విడుదల చేస్తున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇది వరకు రిలీజ్ చేసిన ట్రైలర్, టీజర్, సాంగ్స్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా సోమవారం నాడు ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను నిర్వహించారు. ఈ ఈవెంట్‌కు మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, సుప్రీమ్ హీరో సాయి దుర్గ తేజ్, అడివి శేష్, వెంకీ అట్లూరి వంటి వారు గెస్ట్‌గా విచ్చేశారు. ఈ కార్యక్రమంలో భాగంగా మెగాస్టార్ చిరంజీవి చిత్ర యూనిట్‌కు శుభాకాంక్షలు తెలుపుతూ వీడియో సందేశం ఇచ్చారు.
ఈ సందర్భంగా వరుణ్ తేజ్ మాట్లాడుతూ.. “కమిటీ కుర్రోళ్లు చిత్రాన్ని నేను చూశాను. ఇలాంటి చిత్రం చూసి చాలా ఏళ్లు అయింది. ఈ చిత్రంలో ఉన్నట్టే నాకు ఓ 12 మంది ఫ్రెండ్స్ ఉన్నారు. ఈ మూవీ చూసినప్పుడు నాకు పాత రోజులు గుర్తొచ్చాయి. ప్రతీ కుర్రాడికి ఈ కథ నచ్చుతుంది. చాలా చోట్ల కన్నీరు పెట్టేసుకున్నాను. ఆడియెన్స్‌కి కూడా అలాంటి ఫీలింగ్ కలుగుతుందనిపిస్తుంది. అసలు ఈ చిత్రంలో పన్నెండు పాటలున్నాయని నాకు అనిపించలేదు. అనుదీప్ మంచి పాటలు ఇచ్చారు” అని చెప్పారు.
ఇంకా ఆయన మాట్లాడుతూ.. “సినిమా టీం అంతా కలిసి అద్భుతంగా పని చేసింది. డైరెక్టర్ వంశీకి ఆల్ ది బెస్ట్. ఆగస్ట్ 9న థియేటర్లో జాతరగా ఉండబోతోంది. అందరూ అద్భుతంగా నటించారు. అందరికీ అద్భుతమైన డెబ్యూ దొరికింది. అందరి పేర్లు ఇండస్ట్రీలో వినిపిస్తాయి. కష్టపడి, క్రమశిక్షణతో ఉంటే ఈ ఇండస్ట్రీలో అందరికీ స్థానం ఉంటుంది. ఇంత మంది టాలెంటెడ్ ఆర్టిస్టులను అందిస్తున్న మా చెల్లి నిహారికను చూస్తుంటే గర్వంగా ఉంది. ఆగస్ట్ 9న థియేటర్లో ఈ చిత్రం దద్దరిల్లబోతోంది” అని అన్నారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: