విజయ్ ఆంటోని గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. డిఫరెంట్ సినిమాలతో తమిళ్ లోనే కాదు తెలుగులో కూడా మంచి ఫాలోయింగ్ ను సొంతం చేసుకున్నాడు. అందుకే విజయ్ ఆంటోని నుండి సినిమా వస్తుందంటే ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు. ఇక ప్రస్తుతం తన నుండి వస్తున్న సినిమా తుఫాన్. తమిళంలో మరయ్ పిడిక్కత్త మనిథన్ గా తెరకెక్కిన ఈ మూవీని తెలుగులో తుఫాన్ గా విడుదల చేస్తున్నారు మేకర్స్. ఈసినిమా రిలీజ్ కు సిద్దమవుతున్న నేపథ్యంలో చిత్రయూనిట్ ప్రస్తుతం ప్రమోషన్ కార్యక్రమాలతో బిజీగా ఉంది. ఇదిలా ఉండగా ఈసినిమా ట్రైలర్ ను కూడా రీసెంట్ గానే రిలీజ్ చేశారు మేకర్స్. ట్రైలర్ సినిమాపై అంచనాలను మరింత పెంచేసింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇదిలా ఉండగా ఈసినిమా రిలీజ్ డేట్ ను ఇప్పటికే ప్రకటించిన సంగతి తెలిసిందే కదా. ఆగష్ట్ 2వ తేదీన ఈసినిమాను రిలీజ్ చేయనున్నట్టు తెలిపారు. కానీ ఆరోజున ఈసినిమా రిలీజ్ కాలేకపోయింది. అయితే తాజాగా ఈసినిమా కొత్త రిలీజ్ డేట్ కు సంబంధించిన అప్ డేట్ ను ఇచ్చారు. కొత్త రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేస్తూ అధికారికంగా ప్రకటించారు. ఆగష్ట్ 9వ తేదీన ఈసినిమాను రిలీజ్ చేస్తున్నట్టు తెలిపారు.
కాగా ఈసినిమాలో ఇంకా మేఘా ఆకాష్, మురళీశర్మ, పృథ్వీ అంబర్ తదితరులు కీలకపాత్రల్లో నటిస్తున్నారు. సంగీతం అచ్చు రాజమణి, విజయ్ ఆంటోని అందిస్తుండగా.. రచన, సినిమాటోగ్రఫీ, దర్శకత్వం విజయ్ మిల్టన్ అందిస్తున్నారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: