టాలీవుడ్‌లో కొంతకాలంగా రీ-రిలీజ్‍ల ట్రెండ్ నడుస్తోన్న విషయం తెలిసిందే. గతంలో హిట్ అయిన స్టార్ హీరోల సినిమాలను మేకర్స్ కొన్ని ప్రత్యేక సందర్భాలను పురస్కరించుకుని రీ రిలీజ్ చేస్తున్నారు. అయితే ఈ రీ రిలీజ్‍లకు ప్రేక్షకులు, అభిమానుల నుంచి కూడా మంచి స్పందన వస్తోంది. తాజాగా ఈ లిస్టులోకి సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమాలు రెండు చేరాయి. ఆయన హీరోగా నటించిన సూపర్ హిట్ ఫిల్మ్స్ ‘ఒక్కడు’ మరియు ‘మురారి’ త్వరలో థియేటర్లలోకి రాబోతున్నాయి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
మహేష్ బాబు జన్మదినం సందర్భంగా ఆగస్టు 9న మురారి రీ రిలీజ్ అవుతుండగా.. దీనికి ఒక్కరోజు ముందు ఒక్కడు సినిమా ప్రత్యేకంగా ఎంపిక చేసిన థియేటర్లలో విడుదలకానుంది. దీంతో తమ అభిమాన హీరో చిత్రాలు రెండు ఒక్కరోజు వ్యవధిలో థియేటర్లలోకి వస్తుండటంతో సూపర్ స్టార్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీగా ఉన్నారు. ఈ నేపథ్యంలో మురారి రీ రిలీజ్‍లో ట్రెండ్ క్రియేట్ చేస్తోంది. అడ్వాన్స్ సేల్స్‌లో ఆల్‌టైమ్ రికార్డ్ సృష్టించింది.
ఇప్పటికే మురారి రీ రిలీజ్‍కు సంబంధించి అడ్వాన్స్ బుకింగ్స్ మొదలుకాగా, విడుదలకు ఇంకా మూడు రోజులు సమయం మిగిలిఉండగానే రూ.2 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు అందుకుంది. తద్వారా ఈ ఫీట్ సాధించిన తొలి తెలుగు హీరోగా మహేష్ బాబు చరిత్ర సృష్టించారు. అలాగే మరోవైపు ఓవర్‌సీస్‌లో సైతం ఈ సినిమా సరికొత్త రికార్డులు సాధిస్తోంది.
ఆస్ట్రేలియాలో మురారి అడ్వాన్స్ సేల్స్‌లో ఆల్‌టైమ్ రికార్డ్ దిశగా సాగుతోంది. 11,180 ఆస్ట్రేలియన్ డాలర్స్ వసూళ్లు సాధించింది. అయితే సినిమా విడుదలకు ఇంకా 3 రోజులు సమయం ఉండటంతో ఈ వసూళ్లు భారీగా పెరిగే అవకాశం ఉంది.
ఆస్ట్రేలియాలో టాప్ రీ రిలీజ్ కలెక్షన్లు అందుకున్న తెలుగు సినిమాలు
- సింహాద్రి4కె – A$12,164
- మురారి 4కె – A$. 11,180 (ప్రీ సేల్స్ 3 రోజులు మిగిలి ఉన్నాయి)
- చెన్నకేశవరెడ్డి – $11,047
- జల్సా – A$10,412
- ఖుషి 4K – A$8,141
- ఆరెంజ్ 4K – A$8,048
కాగా క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణ వంశీ దర్శకత్వం వహించిన మురారి సినిమా 2001 ఫిబ్రవరి 17న విడుదలైంది. మహేష్ బాబు టైటిల్ రోల్‌లో నటించగా.. ఆయన సరసన సోనాలి కథానాయికగా కనిపించింది. సీనియర్ నటులు కైకాల సత్యనారాయణ, గొల్లపూడి, లక్ష్మి, ప్రసాద్ బాబు, రఘుబాబు సహా ఎంతోమంది నటీనటులు ముఖ్య పాత్రలు పోషించారు. రామ్ ప్రసాద్ ఆర్ట్స్ పతాకంపై ఎన్ దేవి ప్రసాద్, రామలింగేశ్వరరావు, గోపి నందిగం నిర్మించిన ఈ చిత్రానికి ‘మెలోడీ బ్రహ్మ’ మణిశర్మ పాటలు, నేపథ్య సంగీతం సమకూర్చారు.
తెలుగునాట నెం.1 డిజిటల్ మీడియాగా వెలుగొందుతోన్న ‘మ్యాంగో మాస్ మీడియా’ మురారి రీ-రిలీజ్‍ను సరికొత్త హంగులతో 4Kలో ప్రేక్షకులకు అందిస్తోంది. అలాగే ఈ సినిమా ద్వారా వచ్చే ఆదాయాన్ని స్వచ్ఛంద సేవలను నిర్వహిస్టోన్న ‘మహేష్ బాబు ఫౌండేషన్’ కు అందించనుంది.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: