ట్యాలెంటెడ్ హీరో అడివి శేష్ కథానాయకుడిగా నటించిన సెన్సేషనల్ స్పై థ్రిల్లర్ ‘గూఢచారి’ 6 ఏళ్ళు పూర్తయిన సందర్భంగా తన లేటెస్ట్ మూవీ ‘G2’ నుంచి స్టన్నింగ్ మూమెంట్స్‌తో ఫ్యాన్స్‌ని థ్రిల్ చేశారు. కాగా ఇది గూఢచారికి సీక్వెల్‌గా రూపొందుతున్న విషయం తెలిసిందే. వినయ్ కుమార్ సిరిగినీడి దర్శకత్వం వహిస్తున్న G2లో బనితా సంధు హీరోయిన్‌గా నటిస్తోంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇప్పటికే 40% షూటింగ్ పూర్తి కావడంతో, మేకర్స్ ప్రధానపాత్రలకు సంబంధించిన ఆరు స్టైలిష్ యాక్షన్ మూమెంట్‌లను విడుదల చేశారు. తాజాగా రిలీజ్ చేసిన ఈ స్టిల్స్‌కి వస్తున్న రెస్పాన్స్ చూస్తుంటే.. G2 వైడ్ రేంజ్‍లో ప్రేక్షకులకు రీచ్ అవుతుందనిపిస్తుంది. కాగా ఈ చిత్రానికి డైరెక్టర్ వినయ్ కుమార్‌తో కలిసి శేష్ రైటర్‌గా వ్యవహరిస్తుండటం గమనార్హం.
ఈ సందర్భంగా హీరో అడివి శేష్ మాట్లాడుతూ.. “గూఢచారి సినిమా నాకు చాలా ప్రత్యేకమైనది. గత 6 సంవత్సరాలుగా ఈ సినిమా గురించి ప్రశంసలు వింటూనే వున్నాను. G2 బిగ్గర్ అండ్ ఇంటర్‌నేషనల్ స్కేల్‌లో వుంటుంది. గూఢచారి అభిమానులందరికీ G2 ఒక మ్యాసీవ్ విజువల్ ట్రీట్ అవుతుంది. ఇక ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులకు ఎడ్జ్ ఆఫ్ ది సీట్ ఎక్స్ పీరియన్స్‌ని అందించబోతోంది” అని పేర్కొన్నాడు.
కాగా జి2లో బాలీవుడ్ స్టార్ యాక్టర్ ఇమ్రాన్ హష్మీ కూడా నటిస్తున్న విషయం తెలిసిందే. స్టైలిష్ విలన్‌గా ఆయన కనిపించనున్నారు. 2018లో వచ్చిన గూఢచారి చిత్రానికి హై-ఆక్టేన్ యాక్షన్ సీక్వెల్‌గా ఆరేళ్ల తర్వాత మళ్లీ సెల్యులాయిడ్‌లోకి వస్తోంది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్, ఎకె ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై టిజి విశ్వప్రసాద్, అభిషేక్ అగర్వాల్ కలిసి సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. కాగా ఈ సినిమాను వచ్చే యేడాది పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ చేయనున్నట్టు మేకర్స్ తాజాగా ప్రకటించారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: