నువ్వేకావాలి, మన్మథుడు, మల్లీశ్వరి వంటి క్లీన్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ చిత్రాలను తెరకెక్కించిన ప్రముఖ దర్శకుడు కె.విజయ్ భాస్కర్ దర్శకత్వంలో తాజాగా మరో లవ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ రాబోతుంది. ‘ఉషా పరిణయం’ అనే బ్యూటిఫుల్ టైటిల్‌తో రూపొందిన ఈ చిత్రానికి లవ్ ఈజ్ బ్యూటిఫుల్ అనేది ఉపశీర్షిక. కె. విజయ్ భాస్కర్ స్వీయ దర్శకత్వంలో రూపొందనున్న ఈ చిత్రంలో శ్రీకమల్, తన్వీ ఆకాంక్ష, సూర్య ముఖ్యతారలు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఆగస్టు 2న ఉషా పరిణయం ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ నేపథ్యంలో ఈ చిత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్ ఆదివారం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో సీనియర్ నటుడు శివాజీ రాజా, సంగీత దర్శకుడు ఆర్.ఆర్.ధ్రువన్, కెమెరామెన్ సతీష్ ముత్యాల, కో-డైరెక్టర్ కాళీ, కాస్ట్యూమ్ డిజైనర్ శాన్వి తదిరులు పాల్గొన్నారు.
ఇక ఈ వేడుకకు మెగా సుప్రీమ్ హీరో సాయి దుర్గ తేజ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా సాయి దుర్గ తేజ్ మాట్లాడుతూ తన్వీ ఆకాంక్షకు అన్నయ్యగా ఈ ఫంక్షన్‌కు వచ్చాను. విజయ్ భాస్కర్ దర్శకత్వలో నేను ప్రేమ కావాలి అనే సినిమా చేయాల్సింది, అది మిస్ అయ్యింది. ఆది సాయికుమార్ నా రేయ్ చేయాలి.. ఆది ప్రేమ కావాలి చేశాడు. నేను రేయ్ చేశాను. అలా మారిపోయింది” అని తెలిపారు.
ఇంకా ఆయన మాట్లాడుతూ.. “కమల్ నాకు జిమ్‌లో పరిచయం మంచి హార్డ్‌వర్కర్. ఈ రోజు హీరోగా చేయడం హ్యపీగా వుంది. ఆర్.ఆర్.ధ్రువన్ సంగీతం చాలా బాగుంటుంది. ఆల్ దబెస్ట్. నాకు ఎంతో ఆప్తుడు అయిన సతీష్ అన్న కూతురు ఈ చిత్ర హీరోయిన్ తన్వీ. తన్వీ కూడా మా రికమండేషన్‌తో ఈ సినిమా చేయడం లేదు. ఎంతో కష్టపడి షార్ట్ ఫిల్మ్స్ చేసి ఈ అవకాశం పొందింది. కొత్తవాళ్లతో చేస్తున్న ఈ సినిమా థియేటర్‌కు వెళ్లి సినిమా చూస్తే..ఇలాంటి కొత్త సినిమాలు మరిన్ని వస్తాయి. విజయ్ భాస్కర్ గారికి మంచి విజయం చేకూరాలి” అని పేర్కొన్నారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు :
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























