న్యాచురల్ స్టార్ నాని హీరోగా నటిస్తున్న సినిమా సరిపోదా శనివారం. ఫుల్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా వస్తున్న ఈసినిమాకు వివేక్ ఆత్రేయ దర్శకత్వం వహిస్తున్నాడు. అంటే సుందరానికి తర్వాత నాని-వివేక్ ఆత్రేయ కాంబినేషన్ లో వస్తున్న సినిమా కావటంతో ఈసినిమాపై మరింత క్రేజ్ ఏర్పడింది. ఈసినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటుంది. మరోవైపు ప్రమోషన్ కార్యక్రమాల్లో కూడా జోరు పెంచారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
దీనిలో భాగంగానే ఇప్పుడు తాజాగా ఈసినిమా నుండి మరో స్పెషల్ వీడియోతో వచ్చేశారు. నేడు ఎస్ జే సూర్య పుట్టినరోజు కావడంతో తన స్పెషల్ గ్లింప్స్ ను రిలీజ్ చేశారు మేకర్స్ . నాట్ ఏ టీజర్ అంటూ వచ్చిన గ్లింప్స్ ఆకట్టుకుంటుంది. పురాణాల్లో నరకాసురుడు అనే రాక్షసుడు ఉండేవాడు.. ప్రజలను ఎన్నో ఇబ్బందులు పెడుతుండేవాడు.. అంటూ ఎస్ జే సూర్య ను చూపిస్తారు. టీజర్ ను బట్టి చూస్తే ఎస్ జే సూర్య పాత్ర ఎంత క్రూరంగా ఉంటుందో అర్థమవుతుంది. యాక్షన్ ఎలిమెంట్స్, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ప్రత్యేకమైన ఆకర్షణగా నిలుస్తున్నాయి.
కాగా ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్స్, గ్లింప్స్, వీడియోస్ సోషల్ మీడియాలో మంచి బజ్ ను క్రియేట్ చేశాయి. అంతేకాదు పాటలను కూడా వరుసగా రిలీజ్ చేసుకుంటూ వస్తున్నారు. గరంగరం, ఉల్లాసం అనే రెండు పాటలను రిలీజ్ చేశారు. ప్రియాంక మోహన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈసినిమాలో తమిళ్ టాలెంటెడ్ నటుడు ఎస్ జే సూర్య కూడా ఒక కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఈసినిమాను డీవీవీ ఎంటర్ టైన్ మెంట్స్ పై నిర్మిస్తున్నారు. సెన్సేషనల్ కంపోజర్ జేక్స్ బిజోయ్ సంగీతం అందించగా, మురళి జి సినిమాటోగ్రాఫర్, కార్తీక శ్రీనివాస్ ఎడిటర్. ఈ పాన్ ఇండియా చిత్రం ఆగస్టు 29, 2024న తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో విడుదల కానుంది.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు :
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:


































