టాలీవుడ్ రెబెల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన లేటెస్ట్ బ్లాక్ బస్టర్ ‘కల్కి 2898 AD’. ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అవడమే కాకుండా అన్నిచోట్లా అదిరిపోయే కలెక్షన్స్ అందుకుంటోంది. ఈ మూవీతో ఆయన రెండోసారి రూ.1,000 కోట్ల క్లబ్ లోకి ఎంటరయ్యాడు. ఇంతకుముందు ‘బాహుబలి 2’ సినిమాతో తొలిసారి రూ.1,000 కోట్ల మార్క్ అందుకున్నాడు. ఇక ఈ సినిమాతో ప్రభాస్ భారతదేశంలోని ఫిల్మ్ మేకర్స్‌కు ఓ వరంలా దొరికాడు అని పలువురు అభిప్రాయపడుతున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఎందుకంటే..? మామూలు పాత్రలు ఏ హీరో అయినా చేయగలడు. బట్, ఛాలెంజింగ్ క్యారెక్టర్లు కొందరు మాత్రమే చేయగలరు. అదికూడా పౌరాణిక పాత్రలు, చారిత్రాత్మక పాత్రలు పోషించగలిగిన నటులు ఈ కాలంలో చాలా తక్కువ. అయితే మారుతున్న ప్రేక్షకుల అభిరుచుల మేరకు దర్శకులు కొత్త కొత్త పాత్రలను సృష్టించాల్సి వస్తోంది. దీనికోసం వారు మన భారతీయ ఇతిహాసాలను, చరిత్రను ఔపోసన పడుతున్నారు.
ఈ క్రమంలో పురాణాల స్పూర్తితో నాటి రాజులను, వీరులను నేటి కాలానికి అనుగుణంగా సూపర్ పవర్స్ ఉన్న యోధులుగా హీరోల పాత్రలను డిజైన్ చేసుకుంటున్నారు. దీంతో అలాంటి ఛాలెంజింగ్ క్యారెక్టర్లు పోషించడానికి సరిపడే హీరోల కోసం వారు ముమ్ముర ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే, అలాంటి పురాణపురుషుల, యోధుల పాత్రలకు ఆయా దర్శకులకు కనిపిస్తున్న బెస్ట్ ఆప్షన్ ప్రభాస్. వారు ఎంచుకున్న పాత్రలకు ప్రభాస్ కటౌట్ సరిగ్గా సరిపోతుందని నమ్ముతున్నారు.
ఇందుకు సహేతుక కారణం సజీవంగా కళ్ళ ముందే కనిపిస్తుంటే.. దీనికోసం అంతగా ప్రయాస పడాల్సిన పనిలేదని వారు భావిస్తున్నారు. ఎందుకంటే..? ప్రభాస్ గత కొంతకాలంగా నటిస్తున్న సినిమాలను గమనిస్తే మనకు కూడా ఇదే అభిప్రాయం కలగొచ్చు. ప్రస్తుతం దేశంలోనే ఎక్కువ క్రేజ్ ఉన్న హీరోలలో ప్రభాస్ ముందువరుసలో ఉంటాడంటే అతిశయోక్తి లేదు. ఆయన సినిమా వస్తుందంటే భాషతో సంబంధం లేకుండా యావత్ దేశవ్యాప్తంగా అభిమానులు విపరీతమైన ఆసక్తిని కనబరుస్తున్నారు.
ఇక ప్రభాస్ పైన ఫిల్మ్ మేకర్స్ కి ఇలాంటి భావన కలగడంలో వాస్తవం ఉంది. ఇటీవల ఆయన చేస్తున్న సినిమాలు అది నిజమేనని రుజువు చేస్తున్నాయి. త్రేతాయుగం నాటి పురాణ పురుషుడు శ్రీరాముడిగా ప్రభాస్ ‘ఆదిపురుష్‘ చిత్రంలో నభూతో.. అనిపించాడు. అలాగే ‘కల్కి 2898 AD’లో ద్వాపర యుగంలోని అసామాన్య వీరుడు కర్ణుడు పాత్రలో ప్రభాస్ కనిపించిన తీరుకు ప్రేక్షకులు నీరాజనాలు పట్టారు. ఇక అంతకుముందే ‘బాహుబలి‘ సినిమాలో కలియుగానికి చెందిన చారిత్రిక పాత్రలో నటించి మెప్పించాడు.
వీటితోపాటు ఈ ఏడాది రిలీజైన ‘సలార్: పార్ట్ 1 – సీజ్ ఫైర్‘ చిత్రంలో ఓటమే ఎరుగని ఫైటర్‌గా కనిపించిన విషయం గుర్తుండే వుంటుంది. ఈ సినిమాలోని యాక్షన్ సన్నివేశాలలో ఆయన కత్తి, గొడ్డలి, గన్.. ఇలా ఏది పట్టినా విధ్వంసమే అన్నట్టుగా ఉంటాయి. ప్రభాస్ పర్సనాలిటీ కూడా ఇలాంటి క్యారెక్టర్లకు పర్‌ఫెక్ట్‌గా సరిపోయేలా ఉంటుంది. దీంతో ఈ తరహా పాత్రలకు ప్రభాస్ బెస్ట్ ఆప్షన్‌లా దర్శకులు భావిస్తున్నారు. దీంతో వారు తమ సృజనాత్మకతకు హద్దులు లేకుండా కథలను రాసుకుంటున్నారు. ఇక ప్రభాస్ లాంటి హీరో దొరకడం తమ అదృష్టంగా ఫిల్మ్ మేకర్స్ భావిస్తున్నారు. ముందుముందు ఇంకెన్ని పాత్రలు ప్రభాస్ కోసం సృష్టించబడతాయో? ఇంకెన్ని విధాలుగా ప్రేక్షకులను ఆయన తన నటనతో మెప్పిస్తాడా చూడాలి. ఆల్ ది బెస్ట్ ఫర్ ప్రభాస్..
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్‌ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























