హరీష్ శంకర్, మాస్ మహా రాజా రవితేజ నుండి రాబోతున్న సినిమా మిస్టర్ బచ్చన్. ఈసినిమా హిందీ సూపర్ హిట్ సినిమాకు రీమేక్ అన్న సంగతి తెలిసిందే కదా. ఇక ఈసినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. ఇక రీసెంట్ గానే ఈసినిమా నుండి షో రీల్ పేరుతో గ్లింప్స్ ను రిలీజ్ చేశారు. గ్లింప్స్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ప్రస్తుతం చిత్రయూనిట్ పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈసినిమా నుండి ఫస్ట్ సాంగ్ ను ఇప్పటికే రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే కదా. సితార అంటూ వచ్చిన ఈపాటకు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ పాట కొరియోగ్రఫి విషయంలో కాస్త నెగెటివ్ కామెంట్స్ వచ్చినా డైరెక్టర్ హరీష్ శంకర్ వాటికి సాలిడ్ కౌంటర్లే ఇచ్చారు. ఇప్పుడు సెకండ్ సాంగ్ ను రిలీజ్ చేయడానికి సిద్దమయ్యారు. ఈనేపథ్యంలోనే ఈపాటకు సంబంధించి ఒక అప్ డేట్ ను ఇచ్చారు చిత్రనిర్మాణ సంస్థ. ఫస్ట్ సింగిల్ సితార సాంగ్ కు మంచి రెస్పాన్ వచ్చిన తరువాత మిక్కీ జే మేయర్, హరీష్ శంకర్ మరో చాట్ బస్టర్ సాంగ్ ను ప్రముఖ సింగర్ శ్రీరామ్ తో రికార్డ్ చేయడం జరిగింది. పాట రిలీజ్ డేట్ అనౌన్స్ మెంట్ కోసం వెయిట్ చేయండి అంటూ తమ అధికారిక ట్విట్టర్ ద్వారా తెలియచేశారు.
కాగా ఈసినిమాలో ఈసినిమాలో రవితేజ సరసన భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్ గా నటిస్తోంది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి వివేక్ కూచిభొట్ల సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. మిక్కీ జె మేయర్ సంగీతం అందిస్తుండగా, అయనంక బోస్ సినిమాటోగ్రఫీని అందిస్తున్నారు. ఈ చిత్రానికి అవినాష్ కొల్లా ప్రొడక్షన్ డిజైనర్ కాగా, ఎడిటింగ్ ఉజ్వల్ కులకర్ణి.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: