తమిళ్ లో ఉన్న టాలెంటెడ్ నటుల్లో శివ కార్తికేయన్ కూడా ఒకరని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. చాలా తక్కువ కాలంలోనే మంచి నటుడిగా గుర్తింపు పొందాడు. తన సినిమాలను తమిళ్ లో రిలీజ్ చేస్తూనే తెలుగులో కూడా రిలీజ్ చేస్తుంటాడు. అందుకే తెలుగులో కూడా శివ కార్తికేయన్ కు మంచి క్రేజ్ ఉంది. ఇక ప్రస్తుతం తన లిస్ట్ లో పలు సినిమాలు ఉండగా అందులో రాజ్ కుమార్ దర్శకత్వంలో వస్తున్న సినిమా కూడా ఒకటి ఉంది. ఈసినిమాలో ఆర్మీ ఆఫీసర్ గా కనిపించనున్నాడు శివ కార్తికేయన్. ఈసినిమా ఇప్పటికే షూటింగ్ ను పూర్తిచేసుకొని ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులను ముగించే పనిలో ఉంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఈసినిమా నుండి ఇప్పటికే పలు అప్ డేట్లు ఇచ్చారు మేకర్స్. ఇప్పుడు ఈసినిమా రిలీజ్ డేట్ అనౌన్స్ మెంట్ నేడు ఇవ్వనున్నట్టు చిత్రయూనిట్ ఇప్పటికే అప్ డేట్ ఇచ్చిన సంగతి తెలిసిందే కదా. ఇక చెప్పినట్టే తాజాగా రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేస్తూ అధికారికంగా ప్రకటించారు మేకర్స్ . ఈసినిమాను దీపావళి సందర్భంగా అక్టోబర్ 31వ తేదీన రిలీజ్ చేయనున్నట్టు తెలిపారు.
కాగా ఈసినిమాలో సాయి పల్లవి హీరోయిన్ గా నటిస్తుంది. ఈసినిమాను రాజ్ కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్ బ్యానర్ పై కమల్ హాసన్ మరియు సోనీ పిక్చర్స్ ఫిల్మ్స్ ఇండియా కలిసి నిర్మిస్తున్నారు. ఈసినిమాకు జీవీ ప్రకాష్ సంగీతం అందిస్తున్నాడు. సినిమాటోగ్రాఫర్‌గా సిహెచ్ సాయి పనిచేస్తున్నారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: