డబుల్ ఇస్మార్ట్ హైప్ డబుల్ 

Double Ismart getting huge hype

రామ్-పూరి జగన్నాథ్ ల మచ్ అవైటెడ్ సీక్వెల్ డబుల్ ఇస్మార్ట్ షూటింగ్ పూర్తి చేసుకొని విడుదలకు సిద్దమవుతుంది. ఆగస్టు 15న పాన్ ఇండియా మూవీగా థియేటర్లోకి రానుంది. ఇక ఈసినిమా కు వున్న హైప్ ఒక్కసారిగా డబుల్ అయ్యింది. ఇస్మార్ట్ శంకర్ బ్లాక్ బాస్టర్ కావడంలో సాంగ్స్ కూడా కీ రోల్ ప్లే చేశాయి. ఇప్పుడు ఈ సీక్వెల్ లో వున్న సాంగ్స్ కూడా హైప్ పెంచడానికి చాలా హెల్ప్ అవుతున్నాయి. రీసెంట్ గా వచ్చిన ఫస్ట్ సాంగ్ స్టెప్పా మార్ తో సినిమాకు బజ్ పెరుగగా నిన్న రిలీజ్ చేసిన సెకండ్ సాంగ్ మార్ ముంతా చోడ్ చింతా హైప్ ను డబుల్ చేసింది

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

రామ్ స్టెప్పులు ,కావ్య థాపర్ గ్లామర్ షో అలాగే మణిశర్మ ట్యూన్స్ సాంగ్ కు రిపీట్ వాల్యూ తెప్పించాయి.ఫుల్ వీడియో సాంగ్ అయితే థియేటర్లను షేక్ చేసేలానే వుంది. ఇప్పటికే థియేట్రికల్ బిజినెస్ కూడా క్లోజ్ అయ్యింది. పూరి,రామ్ ల లాస్ట్ సినిమాల ఫలితాలు ఈ సినిమాపై ప్రభావం చూపలేకపోయాయి.అత్యధిక రేటుకు థియేట్రికల్ రైట్స్ అమ్ముడయ్యాయి. 

నార్త్ లోకూడా ఈసినిమాకు బజ్ వుంది.సంజయ్ దత్ ఉండడం అలాగే ఇంతకుముందు రామ్ హిందీ డబ్బింగ్ సినిమాలు యూట్యూబ్ లో నార్త్ ఆడియన్స్ తెగ చూశారు. ఇవి కూడా అడ్వాంటేజ్ కానున్నాయి.రిలీజ్ డేట్ కూడా సరైనది దొరికింది.పెద్దగా పోటీ కూడా లేదు. ట్రైలర్ ఒక్కటి సరిగ్గా కట్ చేస్తే చాలు భారీ ఓపెనింగ్స్ ఖాయం. ఇక హిట్ టాక్ వస్తే రామ్ కెరీర్ లో డబుల్ ఇస్మార్ట్ బిగ్గెస్ట్ బ్లాక్ బాస్టర్ గా నిలువనుంది.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.