శంకర్ -కమల్ హాసన్ ల భారీ ప్రాజెక్ట్ ఇండియన్ 2 ఈనెల 12న థియేటర్లోకి వచ్చింది. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈసినిమా టాక్ తో సంబంధం లేకుండా భారీ ఓపెనింగ్స్ ను రాబట్టుకుంది. అయితే ఆ తరువాత ఆశించిన స్థాయిలో వసూళ్లను దక్కించుకోలేకపోతుంది. ముఖ్యంగా రన్ టైం విషయంలో కంప్లైంట్స్ వచ్చాయి. దాదాపు 3గంటల నిడివితో థియేటర్లోకి రావడం తో స్లో అయిన ఫీలింగ్ తెప్పించింది. దాంతో ఇప్పుడు కొంచెం ట్రిమ్ చేశారు. దాదాపు 12నిమిషాల ఫుటేజీని కట్ చేశారు. తమిళ్ తోపాటు తెలుగు వెర్షన్ ను కూడా ట్రిమ్ చేశారు. ప్రస్తుతం ట్రిమ్ చేసిన వెర్షన్ ను ప్రదర్శిస్తున్నారు. మరి ఇకనుండైనా పుంజుకుంటుందో లేదో చూడాలి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈసినిమాను తెలుగులో ఏషియన్ సినిమాస్, సురేష్ ప్రొడక్షన్ రిలీజ్ చేయగా మొదటి రోజు 10కోట్లకుపైగా గ్రాస్ వసూళ్లను దక్కించుకుంది. దీనికి సీక్వెల్ గా ఇండియన్ 3 కూడా రానుంది. ఆల్రెడీ కమల్ పార్ట్ షూట్ కూడా కంప్లీట్ అయ్యింది. అయితే ఈ థర్డ్ పార్ట్ విషయంలో శంకర్ చాలా కేర్ తీసుకోవాల్సివుంటుంది.
ఇక శంకర్ ప్రస్తుతం గేమ్ ఛేంజర్ షూటింగ్ ను పూర్తి చేసే పనిలో వున్నాడు. రీసెంట్ గానే రామ్ చరణ్ కు సంబంధించిన షూట్ కంప్లీట్ కాగా బ్యాలెన్స్ షూటింగ్ ను పూర్తి చేస్తున్నారు. ఈనెలలో ఈ షూటింగ్ కంప్లీట్ చేసి త్వరలోనే రిలీజ్ డేట్ ను ప్రకటించనున్నారు. ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మిస్తున్న ఈసినిమాపై భారీ అంచనాలు వున్నాయి.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























