అశ్విన్ రామ్ దర్శకత్వంలో ప్రియదర్శి హీరోగా నభా నటేష్ హీరోయిన్ గా వస్తున్న సినిమా డార్లింగ్. చాలా గ్యాప్ తరువాత నభా నటేష్ ఈసినిమాతో రాబోతుంది. ఇక మరో రెండు రోజుల్లో ఈసినిమా ప్రేక్షకుల ముందుకు రానున్న నేపథ్యంలో ఇక ఈసినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో బిజీగా ఉంది. ఈసినిమా నుండి వచ్చిన అప్ డేట్లు సినిమాపై మంచి బజ్ ను క్రియేట్ చేశాయి. వచ్చిన అప్ డేట్లను బట్టి ఇప్పటికే ఈసినిమా కథాంశం ఏంటో అర్థమైపోయింది. మల్టీ పర్సనాలిటీ ఉన్న భార్యతో ఆమె భర్త ఎలాంటి ప్రాబ్లమ్స్ ను ఎదుర్కొన్నాడు అనేది ఈసినిమా కథ అని తెలుస్తుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈసినిమా నుండి వరుసగా పాటలను రిలీజ్ చేసుకుంటూ వస్తున్న సంగతి తెలిసిందే కదా. ఇప్పటికే పలు పాటలను రిలీజ్ చేయగా ఇప్పుడు మరో పెప్పీ సాంగ్ తో వచ్చేశారు. భాగ్ సాలే అంటూ వచ్చే పాటను తాజాగా రిలీజ్ చేశారు మేకర్స్. యంగ్ హీరో నితిన్ ఈపాటను రిలీజ్ చేయడం జరిగింది. నభా నటేష్ మీద వచ్చే ఈపాట ఆకట్టుకునేలా ఉంది.
కాగా ఇంకా ఈ సినిమాలో మురళీధర్ గౌడ్, శివ రెడ్డి, కృష్ణ తేజ కీలకపాత్రల్లో నటిస్తున్నారు. చైతన్య రెడ్డి సమర్పణలో నిరంజన్ రెడ్డి ప్రైమ్ షో ఎంటర్ టైనమెంట్ బ్యానర్ పై ఈసినిమాను నిర్మిస్తున్నారు వివేక్ సాగర్ సంగీతం అందిస్తున్నారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























