మహారాజ స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్

Maharaja will stream on NETFLIX from July 12

విజయ్ సేతుపతి నటించిన రీసెంట్ మూవీ మహారాజ ఓటిటి స్ట్రీమింగ్ డేట్ వచ్చేసింది.నెట్ ఫ్లిక్స్ ఈసినిమా డిజిటల్ హక్కులను సొంతం చేసుకోగా ఈనెల 12 నుండి స్ట్రీమింగ్ లోకి తీసుకురానుంది.తమిళ్ తోపాటు తెలుగు,మళయాలం,కన్నడ ,హిందీ భాషల్లో అందుబాటులోకి రానుంది.ఇక గత నెలలో థియేటర్లోకి వచ్చిన ఈసినిమా ఎక్స్ట్రాడినరీ రివ్యూస్ ను సొంతం చేసుకోవడంతో బాక్సాఫీస్ వద్ద అదరగొట్టింది. 

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ప్రపంచ వ్యాప్తంగా 100కోట్లకు పైగా వసూళ్లను రాబట్టి బ్లాక్ బాస్టర్ అనిపించుకుంది.ఈసినిమాతో విజయ్ సేతుపతి మొదటి సారి 100కోట్ల క్లబ్ లోకి ఎంట్రీ ఇచ్చాడు.ఇది తనకు 50వ సినిమా కావడం విశేషం.మహారాజ తెలుగులో కూడా రిలీజ్ కాగా డీసెంట్ హిట్ అనిపించుకుంది.నిథిలిన్ స్వామి నాథన్ డైరెక్ట్ చేయగా అనురాగ్ కశ్యప్,మమతా మోహన్ దాస్,అభిరామి కీలక పాత్రల్లో నటించారు.అజినీష్ లోకనాథ్ సంగీతం అందించాడు.సుధాన్ సుందరం,జగదీష్ పళనిస్వామి నిర్మించారు. 

ఇక విజయ్ సేతుపతి ప్రస్తుతం తన 51వ సినిమా ఏస్ లో నటిస్తున్నాడు.కాంతార ఫేమ్ రుక్మిణి వసంత్ ఇందులో హీరోయిన్ గా నటిస్తుండగా అరుముగ కుమార్ డైరెక్ట్ చేస్తున్నాడు.జస్టిన్ ప్రభాకరన్ సంగీతం అందిస్తున్నాడు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.