ధనుష్ సినిమాకు ఇంటర్నేషనల్ అవార్డ్

Dhanush's Captain Miller Wins UK National Film Award For Best Foreign Language Film

కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ నటించిన సినిమాకు అరుదైన గౌరవం లభించింది. ఆయన నటించిన ‘కెప్టెన్ మిల్లర్’ అంతర్జాతీయ అవార్డును అందుకుంది. అరుణ్ మాథేస్వరన్ దర్శకత్వం వహించిన ఈ సినిమా 100 కోట్లకు పైగా వసూళ్లు సాధించి థియేటర్లలో సూపర్ సక్సెస్ అందుకుంది. ఇందులో ధనుష్ నటనకు విమర్శకుల ప్రశంసలు కూడా దక్కాయి.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

కాగా గత కొన్నిరోజుల క్రితమే కెప్టెన్ మిల్లర్ యూకే నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్‌లో ఉత్తమ విదేశీ భాషా చిత్రంగా నామినేట్ చేయబడింది. తాజాగా ఈ సినిమా 2024 సంవత్సరానికి గానూ ఉత్తమ విదేశీ భాషా చిత్రంగా ఎంపికైంది. ఈ మేరకు చిత్ర నిర్మాణ సంస్థ సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది.

ఇక ఇంతకుముందు హాలీవుడ్ లెజెండరీ డైరెక్టర్స్ అయిన రస్సో బ్రదర్స్ చిత్రం ‘ది గ్రే మ్యాన్‌’లో కీలక పాత్ర పోషించిన తర్వాత ధనుష్ ప్రపంచవ్యాప్త గుర్తింపు పొందాడు. ఈ సినిమా అతనికి అంతర్జాతీయ ఖ్యాతిని తెచ్చిపెట్టింది. తాజాగా కెప్టెన్ మిల్లర్ చిత్రానికి అవార్డ్ రావడంతో ధనుష్ క్రేజ్ అంతర్జాతీయంగా మరింత పెరిగే ఛాన్స్ ఉంది.

ఇక నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్‌లో కెప్టెన్ మిల్లర్‌తో పాటు ఉత్తమ విదేశీ భాషా చిత్రంగా ఎంపికైన ఇతర చిత్రాలు.. ఫైటింగ్ ది వోల్ఫ్ ప్యాక్ (స్పెయిన్), భక్షక్ (భారతదేశం), పరేడ్స్ (జపాన్), రెడ్ ఒల్లెరో: మబుహే ఈజ్ ఎ లై (ఫిలిప్పీన్స్), సిక్స్టీ మినిట్స్ (జర్మనీ), మరియు ది హార్ట్‌బ్రేక్ ఏజెన్సీ (జర్మనీ).

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.