ఈమధ్య నిర్మాణ సంస్థలు కూడా డిస్ట్రిబ్యూషన్ వైపు మొగ్గుచూపుతున్నాయి. సినిమాను తాము నిర్మించకపోయినా రిలీజ్ చేయడానికి మాత్రం ముందుకు వస్తున్నారు. ఇప్పటికే టాలీవుడ్లో టాప్ ప్రొడక్షన్ హౌస్ లు కూడా ఈ పంథాలోకి వచ్చాయి. అందులో మైత్రీ మూవీ మేకర్స్ కూడా ఒకటి. ఒకపక్క సినిమాలు నిర్మిస్తూనే మరోపక్క డిస్ట్రిబ్యూషన్ లో కూడా తన సత్తా చాటుతుంది అగ్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఇప్పుడు మైతీ వారు మరో పెద్ద సినిమా రిలీజ్ హక్కులను సొంతం చేసుకున్నారు. ఆ సినిమా మరేదో కాదు సూర్య హీరోగా వస్తున్న కంగువ సినిమా. కంగువ సినిమా నైజాం రిలీజ్ హక్కులను మైత్రీ మూవీ మేకర్స్ వారు సొంతం చేసుకున్నారు. ఇక ఈ విషయాన్ని చిత్ర నిర్మాణ సంస్థ అధికారికంగా తెలియచేశారు.
కాగా స్టార్ డైరెక్టర్ శివ దర్శకత్వంలో సూర్య హీరోగా వస్తున్న సినిమా కంగువ. ఈసినిమా హిస్టారికల్ వార్ బ్యాక్‌డ్రాప్‌లో.. ఈ సినిమా 1000 సంవత్సరాల క్రితం జరిగిన కథ ఆధారంగా తెరకెక్కుతున్నట్టు తెలుస్తుంది. ఈసినిమాలో సూర్య సరసన దిశా పటాని హీరోయిన్ గా నటిస్తుంది. ఈ సినిమాని స్టూడియో గ్రీన్ తో పాటు టాలీవుడ్ టాప్ ప్రొడక్షన్ సంస్థ యు.వీ క్రియేషన్స్ కూడా కలిసి నిర్మిస్తుంది. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. మొత్తం 3డీ వర్షెన్‌లో పలు భాషల్లో ఈ సినిమా విడుదల కానుంది. మరి డిఫరెంట్ కాన్సెప్ట్ తో వస్తున్న ఈసినిమా ఎన్ని సంచలనాలు క్రియేట్ చేస్తుందో చూడాలి.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























