వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో న్యాచురల్ స్టార్ నాని హీరోగా వస్తున్న సినిమా సరిపోదా శనివారం. అంటే సుందరానికి తర్వాత నాని-వివేక్ ఆత్రేయ కాంబోలో వస్తున్న సినిమా కావడంతో అంచనాలు భారీగానే ఉన్నాయి. ఈసినిమా యాక్షన్ ఎంటర్ టైనర్ గా రాబోతుంది. ప్రస్తుతం ఈసినిమా షూటింగ్ ను పూర్తి చేసుకుంటుంది. మరోవైపు ఈసినిమా ప్రమోషన్స్ ఎప్పుడో మొదలుపెట్టారు మేకర్స్. ఇప్పటికే నాని ఫస్ట్ లుక్, గ్లింప్స్ ఇంకా ఫస్ట్ సింగిల్ ను కూడా రిలీజ్ చేశారు మేకర్స్. గరం గరం అంటూ రిలీజ్ చేసిన ఫస్ట్ సింగిల్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ పాట తెలుగు తో పాటు తమిళ్, కన్నడ, మలయాళంలో కూడా రిలీజ్ చేశారు. ఇక ఇప్పుడు తాజాగా ఈసినిమా నుండి మరో అప్ డేట్ తో వచ్చారు. ఈసినిమా నుండి నాని సెకండ్ లుక్ ను రిలీజ్ చేశారు మేకర్స్. ఒక బ్యాగ్ వేసుకొని బైక్ పై వెళ్తున్న నాని కూల్ లుక్ అయితే ఆకట్టుకుంటుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
కాగా ప్రియాంక మోహన్ ఈసినిమాలో హీరోయిన్ గా నటిస్తుంది. గ్యాంగ్‌లీడర్ తర్వాత నాని, ప్రియాంకా మోహన్ కాంబోలో వస్తున్న రెండో సినిమా ఇది. ఈసినిమాలో తమిళ్ టాలెంటెడ్ నటుడు ఎస్ జే సూర్య కూడా ఒక కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఈసినిమాను డీవీవీ ఎంటర్ టైన్ మెంట్స్ పై నిర్మిస్తున్నారు. సెన్సేషనల్ కంపోజర్ జేక్స్ బిజోయ్ సంగీతం అందించగా, మురళి జి సినిమాటోగ్రాఫర్, కార్తీక శ్రీనివాస్ ఎడిటర్. ఈ పాన్ ఇండియా చిత్రం ఆగస్టు 29, 2024న తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో విడుదల కానుంది.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు :
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:

































