శంకర్ దర్శకత్వంలో కమల్ హాసన్ ప్రధాన పాత్రలో వస్తున్న మోస్ట్ అవైటెడ్ సినిమా ఇండియన్2. ఈసినిమా భారతీయుడు సినిమాకు సీక్వెల్ అన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో కూడా కమల్ హాసన్ స్వతంత్ర సమరయోధుడు సేనాపతి పాత్రలో పవర్‌ఫుల్ ఫెర్ఫార్మెన్స్ మరోసారి ప్రేక్షకులను అలరించడానికి వచ్చేస్తున్నాడు. ఇక ఎప్పుడో మొదలైన ఈసినిమా పలుమార్లు షూటింగులు వాయిదా పడుతూ.. షూటింగ్ జరుపుకొంటూ వస్తుంది. ఎట్టకేలకు జులై12వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ప్రస్తుతం చిత్రయూనిట్ ప్రమోషన్ కార్యక్రమాలతో బిజీగా ఉంది. రీసెంట్ గానే ట్రైలర్ ను కూడా రిలీజ్ చేశారు. ట్రైలర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇక ఈసినిమా నుండి వరుసగా పాటలను రిలీజ్ చేస్తున్న సంగతి తెలిసిందే కదా. ఇప్పటికే పారా అంటూ వచ్చే ఫస్ట్ సింగిల్, చెంగలువ అనే సెకండ్ సింగిల్ ను రిలీజ్ చేసారు. రెండు పాటలు కూడా మంచి రెస్పాన్స్ ను సొంతం చేసుకున్నాయి. ఇప్పుడు మరో పాటకు సంబంధించిన అప్ డేట్ వచ్చేసింది. క్యాలెండర్ సాంగ్ అంటూ వచ్చే పాటను తాజాగా రిలీజ్ చేశారు మేకర్స్.
ఈ సినిమాలో కాజల్ అగర్వాల్, రకుల్ ప్రీత్ సింగ్, ప్రియ భవాని శంకర్ ఫీమేల్ లీడ్ లో నటిస్తుండగా.. సిద్ధార్ధ్, సముద్రఖని ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. లైకా ప్రొడక్షన్స్, రెడ్ జియాంట్ మూవీస్ పై ఉదయనిధి స్టాలిన్, సుభాస్కరన్ ఈసినిమాను తెరకెక్కిస్తున్నారు. అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్నారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























