నాగ చైతన్య,సాయి పల్లవి ల తండేల్ షూటింగ్ యమ ఫాస్ట్ గా జరుగుతుంది.నిన్నటితో శ్రీకాకుళంలో ఓ షెడ్యూల్ కంప్లీట్ అయ్యింది.ఇందులో లీడ్ పెయిర్ పై ఓ సాంగ్ ను షూట్ చేశారు.దీంతో ఇప్పటివరకు 70 శాతం షూటింగ్ కంప్లీట్ అయ్యింది.నెక్స్ట్ షెడ్యూల్ జులై లో స్టార్ట్ కానుంది.ఇక సినిమా కూడా బాగా వస్తుందని అంటున్నారు.ఈసినిమా విజయం పై నాగ చైతన్య ఫుల్ కాన్ఫిడెంట్ గా వున్నాడు.ఇందులో చైతన్య బోటు డ్రైవర్ గా కనిపించనున్నాడు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
వాస్తవిక సంఘటనల ఆధారంగా చందు మొండేటి తెరకెక్కిస్తున్న ఈసినిమాకు రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు.భారీ బడ్జెట్ తో గీతా ఆర్ట్స్ బ్యానర్ పై అల్లు అరవింద్, బన్నీ వాస్ నిర్మిస్తున్నారు.ఈ సినిమాను డిసెంబర్ లో రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. అయితే ఆ నెలలో పోటీ గట్టిగానే ఉండనుంది. స్టార్టింగ్ లో పుష్ప 2 రిలీజ్ కానుంది.ఇక క్రిస్మస్ సీజన్ లో ప్రస్తుతానికి నితిన్ రాబిన్ హుడ్ మాత్రమే స్లాట్ ను బుక్ చేసుకుంది అయితే క్రిస్మస్ టార్గెట్ గా మరి కొన్ని సినిమాలు బరిలో నిలువనున్నాయని సమాచారం.మరి ఇంత పోటీలో తండేల్ ను ఉంచుతారా లేదా ముందుకు జరుపుతారా అనేది చూడాలి.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























