పవన్ అంటే తుఫాన్-మోడీ ప్రశంసలు

narendra modi praises on pawan kalyan

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ క్రేజ్ దేశవ్యాప్తంగా పెరిగిపోయింది. ఏపీలో కూటని ఘన విజయం సాధించడంలో పవన్ పాత్ర కీలకం అని ఇప్పటికే అందరూ ప్రశంసలు కురిపిస్తున్నారు. దానికి తోడు పొత్తులో భాగంగా పవన్ తీసుకుంది 21 సీట్లే అయినా కూడా వందకి వంద శాతం స్ట్రైక్ రేట్ ను సాధించి 21 సీట్లలో విజయం సాధించి ఆ దిశగా మరో రికార్డును క్రియేట్ చేశాడు. ఇక కూటమి పాత్ర కూడా ఎన్డీఏ ప్రభుత్వ ఏర్పాటులో కీలకం కానుండటం కూడా కలిసొచ్చిన విషయం.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఈనేపథ్యంలోనే నేడు ఏన్డీఏ కూటమి మీటింగ్ జరిగిన సంగతి తెలిసిందే కదా. ఓల్డ్ పార్లమెంట్ లో జరిగిన ఈ మీటింగ్ లో ప్రధాని తో పాటు చంద్రబాబు, పవన్ ఇంకా పలువురు ముఖ్య నేతలు పవన్ సహా మోడీతో కలిసి కూర్చొని తమ ఎన్డీయే నాయకునిగా మోడీని ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా మోడీ పలువురి నేతల గురించి మాట్లాడారు. ఈనేపథ్యంలో పవన్ గురించి మాట్లాడుతూ.. పవన్ అంటే పవనం కాదని తుఫాన్ అని ప్రశంసించారు. అంతేకాదు.. పవన్ హిందూస్తాన్ లో ప్రతి సామాన్యుడి వికాసానికి ప్రతితిబింబం అంటూ పొగడ్తలు కురిపించారు. ఇంకా పవన్ కళ్యాణ్, చంద్రబాబు వలనే భారీ విజయం దక్కిందన్నారు.

 

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.