థగ్ లైఫ్ షూటింగ్ అప్డేట్

Thug Life shooting update

పొన్నియిన్ సెల్వన్ 2 తరువాత లెజండరీ డైరెక్టర్ మణిరత్నం నుండి వస్తున్న సినిమా థగ్ లైఫ్. కమల్ హాసన్ హీరో గా నటిస్తుండగా యంగ్ హీరోలు శింబు, అశోక్ సెల్వన్ కీలక పాత్రలు పోషిస్తున్నారు.ఈసినిమా షూటింగ్ ప్రస్తుతం పాండిచ్చేరి లో జరుగుతుంది.అక్కడి ఎయిర్ పోర్ట్ లో కీలకమైన యాక్షన్ సన్నివేశాలను తెరకెక్కిస్తున్నారు.అక్టోబర్ లోగా షూటింగ్ పూర్తి చేసి ఈఏడాది చివర్లో విడుదలచేసేలా ప్లాన్ చేస్తున్నారు. ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తుండగా కమల్ సొంత బ్యానర్ రాజ్ కమల్ ఫిలిమ్స్ ఇంటర్నేషనల్ నిర్మిస్తుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక రెండేళ్ళ క్రితం విక్రమ్ తో ఇండస్ట్రీ హిట్ కొట్టి స్ట్రాంగ్ కం బ్యాక్ ఇచ్చాడు కమల్ హాసన్.ఈసినిమా తరవాత కమల్, ఇండియన్ 2 తోప్రేక్షకుల ముందుకు రానున్నాడు. శంకర్ డైరెక్ట్ చేయగా అనిరుధ్ సంగీతం అందిస్తున్నాడు.లైకా ప్రొడక్షన్స్ నిర్మిస్తుంది.జూలై 12న తమిళ్ తోపాటు తెలుగు, హిందీ లో ఇండియన్ 2 రిలీజ్ కానుంది. దీనికి సీక్వెల్ గా రానున్న ఇండియన్ 3 షూటింగ్ ను కూడా కమల్ పూర్తి చేశాడు.

ఇక ప్రభాస్ కల్కి 2898 ఏడిలో కూడా కీలక పాత్రలో కనిపించనున్నాడు కమల్ హాసన్. ఈసినిమా జూన్ 27న విడుదలవుతుంది.నాగ్ అశ్విన్ తెరకెక్కిస్తుండగా అమితాబ్, దీపికా, దిశా పటాని కీలక పాత్రలు పోషించారు.ఈసినిమాపై భారీ అంచనాలు వున్నాయి.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.