విరించి వర్మ దర్శకత్వంలో రాకేష్ వర్రె హీరోగా వస్తున్న సినిమా జితేందర్ రెడ్డి. 1980ల కాలంలో జరిగిన వాస్తవ ఘటనలతో.. పేద ప్రజల కోసం పోరాటం చేసిన జగిత్యాలకు చెందిన జితేందర్‌రెడ్డి జీవితం ఆధారంగా ఈ మూవీ తెరకెక్కుతోంది. ఈసినిమా మే 3వ తేదీన ఈసినిమా ప్రేక్షకుల ముందుకు రానున్న నేపథ్యంలో ప్రస్తుతం చిత్రయూనిట్ ప్రమోషన్ కార్యక్రమాలతో బిజీగా ఉంది. ఈసినిమా నుండి ఇప్పటికే టీజర్ ను అలానే పాటలను రిలీజ్ చేయగా వాటికి సూపర్ రెస్పాన్స్ వచ్చింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇప్పుడు తాజాగా ఈసినిమా ట్రైలర్ ను రిలీజ్ చేశారు మేకర్స్. ట్రైలర్ కూడా ఆకట్టుకుంటుంది. చిన్నప్పటినుండే సమాజం పట్ల అంకితభావం ఉన్న జితేందర్ రెడ్డి, సమాజానికి ఏదో ఒక మంచి చెయ్యాలి అనే భావంతో పెరుగుతాడు. ఆ లక్షణాలు జితేందర్ రెడ్డితో పాటు పెరిగి, కాలేజీ ఎలక్షన్స్ లో లీడర్ గా ఎదిగి, ఆ తరవాత పోలీసు వ్యవస్థకే దీటుగా, సమాజంలో నక్సలైట్లు చేసే దోర్జన్యాలకు ఎదురు వెళ్తాడు, ట్రైలర్ మద్యలో హిందుత్వం వంటి డైలాగ్ లు మరింత ఆశక్తి పెంచేలా ఉన్నాయి. 1980’s ఒక వ్యక్తి జీవితంలో జరిగే కాలేజీ పాలిటిక్స్, ఆ తరవాత నిజమైన రాజకీయాలు నేపధ్యంలో ఈ కథ సాగుతున్నట్టు ఉంది. మొత్తానికి కంటెంట్ మాత్రం ప్రోమిసింగ్ గా ఉంది
Embark on a journey of discovery with the untold story of #JithenderReddy 🔥
Here’s the theatrical trailer out now – https://t.co/M6AXGYQKu6
Worldwide grand release at cinemas near you on MAY 10th! 🔥
Directed by @virinchivarma 🎬@rakesh_varre @IRiyaSuman @GopiSundarOffl… pic.twitter.com/EAaj0twBs7
— Aditya Music (@adityamusic) May 2, 2024
కాగా ఈసినిమా లో వైశాలి రాజ్, రియా సుమన్, చత్రపతి శేఖర్, సుబ్బరాజు మరియు రవి ప్రకాష్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ముదుగంటి క్రియేషన్స్ పై ముదుగంటి రవీందర్ రెడ్డి ఈసినిమాను నిర్మిస్తున్నారు. గోపి సుందర్ సంగీతం అందిస్తున్న ఈసినిమాకు ఎస్. జ్ఞాన శేఖర్ సినిమాటోగ్రాఫర్ గా పనిచేస్తున్నారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























