అమెరికాలో దుమ్ము రేపుతున్న టిల్లు స్క్వేర్

Tillu Square Collects Over $ 2.9 Million Gross in North America

స్టార్ బాయ్ సిద్ధు జొన్నలగడ్డ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ ‘టిల్లు స్క్వేర్’. గతంలో ఆయన హీరోగా వచ్చిన ‘డీజే టిల్లు’కి సీక్వెల్‍గా రూపొందిన ఈ మూవీకి మల్లిక్ రామ్ దర్శకత్వం వహించారు. అలాగే హారో సిద్ధు జొన్నలగడ్డ ఈ సినిమాకు స్వయంగా కథనం, సంభాషణలు అందించడం విశేషం. అనుపమ పరమేశ్వరన్ కథానాయికగా నటించగా.. మురళీధర్, ఆంథోనీ, సుజాత తదితరులు కీలక పాత్రలు పోషించారు. మార్చి 29న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా తొలిరోజే బ్లాక్ బస్టర్ టాక్ అందుకుంది. దీంతో విడుదలైన అన్ని ఏరియాల్లో ఈ మూవీ స‌క్సెస్‌ఫుల్‌గా రన్ అవుతోంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ఓవర్సీస్‌లో సైతం అదిరిపోయే కలెక్షన్లతో దుమ్మురేపుతోంది. ఈ క్రమంలో కేవలం 4 రోజుల్లోనే 2 మిలియన్ డాలర్లు వసూలు చేసి టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా నిలిచింది. అంచనాలకు మించి భారీ బ్లాక్ బస్టర్ దిశగా దూసుకుపోతోంది. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం.. ఈ కామెడీ థ్రిల్లర్ 18 రోజుల్లో నార్త్ అమెరికాలో 2.9 మిలియన్లకు పైగా గ్రాస్ వసూలు చేసి ఔరా అనిపించింది. అంతేకాకుండా త్వరలోనే 3 మిలియన్ డాలర్ క్లబ్ లో అడుగుపెట్టే దిశగా పరుగులు పెడుతోంది.

ఈ నేపథ్యంలో ‘టిల్లు స్క్వేర్’ విడుదలైన మూడు రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ సాధించడంతో పాటు కొత్త ల్యాండ్ మార్క్స్ అందుకుంటోంది. ఈ క్రమంలో ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకు రూ.125.2 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు అందుకుంది. ఇక సిద్దు జొన్నలగడ్డ కెరీర్‌లో ఇదే తొలి 100 కోట్ల మూవీ కావడం విశేషం. కాగా ఈ చిత్రాన్ని శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మించారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇

తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

12 − two =