ఓటీటీలోకి ప్రేమలు.. స్ట్రీమింగ్‌ ఎక్కడంటే?

Premalu Telugu Version to be Released in Aha On April 12

ఇటీవలి కాలంలో మలయాళం సినిమాలు అదరగొడుతున్నాయి. కాన్సెప్ట్ బేస్డ్ స్టోరీలతో సహజత్వానికి దగ్గరగా ఉండే ఈ సినిమాల మేకింగ్ స్టయిల్ దేశవ్యాప్తంగా అన్ని భాషలవారిని ఆకట్టుకుంటోంది. ఈ ఏడాది ఇప్పటికే కొన్ని సినిమాలు బక్సాఫిస్ వద్ద సత్తా చూపాయి. సూపర్ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్ నటించిన ‘ఆడుకాలం (గోట్ లైఫ్), దాదాపుగా అందరూ కొత్తవారే నటించిన ‘మంజుమ్మల్ బాయ్స్’ చిత్రాలు అత్యధిక కలెక్షన్స్ రాబట్టాయి. వీటితోపాటుగా ఫిబ్రవరి 9న విడుదలైన ‘ప్రేమలు’ కూడా బ్లాక్ బస్టర్ హిట్ అయింది. ఈ సినిమాకు ప్రేక్షకుల ఆదరణతో పాటు విమర్శకుల నుంచి ప్రశంసలు సైతం దక్కాయి.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

దీంతో ‘ప్రేమలు’ చిత్రాన్ని దర్శక ధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి తనయుడు ఎస్.ఎస్. కార్తికేయ తెలుగు ప్రేక్షకుల ముందుకు తెచ్చిన విషయం తెలిసిందే. గతనెలలో (మార్చి 8)న విడుదలైన ఈ మూవీ తెలుగు వెర్షన్‌కు కూడా మంచి స్పందన వచ్చింది. ఈ నేపథ్యంలో ప్రేమలు సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ లాక్ చేసుకుంది. త్వరలోనే ఈ సెన్సేషనల్ హిట్ ఓటీటీ లోకి అందుబాటులోకి రానుంది. ఏప్రిల్ 12న ఈ చిత్రం తెలుగు వెర్షన్ ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ ఆహా వేదికగా స్ట్రీమింగ్‌ కానుంది. ఈ మేరకు ప్రేమలు స్ట్రీమింగ్‌పై అధికారిక ప్రకటన వెలువడింది.

అలాగే డిస్నీ+హాట్‌స్టార్‌లో ప్రేమలు మల‌యాళం, త‌మిళ, హిందీ భాష‌ల‌లో అందుబాటులో ఉండనుంది. ఇక ఈ చిత్రాన్ని నిర్మించిన నిర్మాతలలో మ‌ల‌యాళ స్టార్ యాక్టర్, ‘పుష్ప’ ఫేమ్ ఫహద్ ఫాజిల్ భాగస్వామి కావడం విశేషం. గిరీష్ ఏడీ దర్శకత్వం వ‌హించిన ఈ సినిమాలో నస్లేన్, మమితా, అల్తాఫ్ సలీమ్, మీనాక్షి రవీంద్రన్, అఖిల భార్గవన్ ప్ర‌ధాన పాత్ర‌లు పోషించారు. కాగా ప్యూర్ లవ్ కామెడీగా తెరకెక్కిన ఈ సినిమా షూటింగ్ అత్యధిక భాగం హైదరాబాద్‌లోనే జ‌రుపుకోవ‌డం విశేషం.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.